Poll Tracker: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు ? తాజా సర్వేలో షాకింగ్ ఫలితాలు..!

దేశ రాజకీయాల్లో తాజాగా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల క్రితం వరుసగా మూడోసారి లోక్ సభ ఎన్నికల్లో నెగ్గి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ.. ప్రస్తుతం పెను సవాళ్లు ఎదుర్కొంటున్నారు. నీట్ అక్రమాల నేపథ్యంలో విద్యార్ధులు మొదలుపెట్టిన ఉద్యమాలు ఇప్పుడు ఏకంగా ఒక్కో రాష్ట్రానికీ విస్తరిస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీని తక్కువ అంచనా వేసిన కేంద్రానికి.. ఆ తర్వాత వారితోనే చర్చలు జరపాల్సిన పరిస్ధితి ఎదురైంది. ఢిల్లీ నిరసనల తర్వాత జార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విద్యార్ధులు, హర్యానాలో రైతులు రోడ్డెక్కుతున్నారు.

డీలిమిటేషన్ బిల్లు వేళ కేంద్రానికి ఝలక్..! టీఎంసీ రెబెల్స్ యూటర్న్..!
డీలిమిటేషన్ బిల్లు వేళ కేంద్రానికి ఝలక్..! టీఎంసీ రెబెల్స్ యూటర్న్..!

ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు ఎవరికి ఓటేస్తారన్న దానిపై పోల్ ట్రాకర్ (Poll Tracker) సంస్థ సర్వే (Mood of India 2026)నిర్వహించింది. ఇందులో ఇప్పటికిప్పుడు దేశంలో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే అధికార ఎన్డీయే కూటమికి కేవలం 240 స్ధానాలు మాత్రమే దక్కనున్నట్లు తేలిపోయింది. అలాగే విపక్ష ఇండియా కూటమికి 280 సీట్లు లభిస్తాయని పోల్ ట్రాకర్ అంచనా వేసింది. ఇతరులకు 23 సీట్లు దక్కవచ్చని తెలిపింది. ఎన్డీయేకు ప్రస్తుతం లోక్ సభలో 293 సీట్లు ఉండగా, ఇండియా కూటమికి 234 సీట్లు ఉన్నాయి. ఇతరులకు 16 సీట్లు ఉన్నాయి.

Mood of India 2026 INDIA Bloc Leads With 280 Seats NDA Trails at 240 in Poll Tracker Survey
అమిత్ షా యూటర్న్..! 48 గంటల్లో మారిన సీన్-విపక్షానికి కండిషన్లు..!
అమిత్ షా యూటర్న్..! 48 గంటల్లో మారిన సీన్-విపక్షానికి కండిషన్లు..!

అలాగే జూలై 3 నుంచి ఆగస్టు 7 వరకూ తమ మూడ్ ఆఫ్ ఇండియా సర్వే 2026 నిర్వహించినట్లు పోల్ ట్రాకర్ సంస్ద తెలిపింది. తమ సర్వేలో ఈసారి ఎన్డీయే కూటమికి 40 శాతం ఓటర్లు మాత్రమే మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపింది. అలాగే ఇండియా కూటమికి 44 శాతం ఓటర్లు మద్దతుగా నిలవబోతున్నట్లు తేల్చింది. ఇతరులకు మరో 16 శాతం ఓటర్లు మద్దతిస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ర్యాండమ్ లో 4 లక్షల 35 వేల 451 మందిపై ఈ సర్వే నిర్వహించినట్లు పోల్ ట్రాకర్ తెలిపింది. దీన్ని బట్టి ప్రజల నాడిలో మార్పు వస్తున్నట్లు అర్దమవుతోంది.

Mood of India 2026 INDIA Bloc Leads With 280 Seats NDA Trails at 240 in Poll Tracker Survey

అలాగే పోల్ ట్రాకర్ సర్వేలో యువతలో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడిగా రాహుల్ గాంధీ 58 శాతం ఓట్లు సాధించారు. నరేంద్ర మోడీకి కేవలం 36 శాతం ఓట్లు దక్కాయి. అలాగే విపక్ష నేతగా రాహుల్ గాంధీ పనితీరు ఎలా ఉందని అడిగితే 61 శాతం బాగుందని, 39 శాతం బాగోలేదని చెప్పారు. వీటితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ యువత వాణిగా మారిందా అని అడిగితే అవునని 59 శాతం మంది, కాదని 32 శాతం మంది, చెప్పలేమని 9 శాతం మంది చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+