భారత్ - పాకిస్థాన్ యుద్ధం.. కొండంత నష్టం ఆ దేశానికే.. సంచలన నివేదిక బయటకు
జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు మరణించిన నేపథ్యంలో పాకిస్థాన్- భారత్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసిగా భారత్ ఉంది. ఈ క్రమంలో భారత్.. ఎప్పుడు, ఎక్కడ.. ఏ సమయంలో దాడి చేస్తుందోనని పాకిస్థాన్ బిక్కుబిక్కుమంటూ ఉంటోంది.
ఒకవేళ భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగితే భారత్ కంటే పాకిస్థాన్ అధికంగా నష్టాన్ని చవిచూస్తుందని ప్రఖ్యాత మూడీస్ రేటింగ్స్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం కారణంగా పాకిస్థాన్ దగ్గర ఉన్న నిధులు పూర్తిగా అయిపోతాయని.. అప్పు కూడా పుట్టదని.. దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని సూచనలు చేసింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించింది.
భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నవేళ పాకిస్థాన్ కు సాయం చేసేందుకు ఏ దేశం కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదని మూడీస్ రేటింగ్స్ సంస్థ పేర్కొంది. విదేశీ మారక ద్రవ్యాలు ఇప్పుడు కావాల్సిన దాని కంటే తక్కువే ఉన్నాయని యుద్ధం కారణంగా మరింత తగ్గుతాయని నివేదిక పేర్కొంది. పాకిస్థాన్ దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్యాలు 15 బిలియన్ డాలర్లు కాగా భారత్ వద్ద 688 బిలియన్ డాలర్లు ఉన్నట్లు.. దీన్ని బట్టి చూస్తేనే పాకిస్థాన్ పరిస్థితి అర్థం అవుతోందని మూడీస్ నివేదిక పేర్కొంది.
పాకిస్థాన్ తో పోల్చితే భారత్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థల ఉత్పత్తుల వినియోగం కారణంగా భారత్ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని మూడీస్ పేర్కొంది. యుద్ధం కారణంగా భారత్ లో పెద్దగా మార్పు ఉండదని.. భారత్ ఎగుమతుల్లో కేవలం 0.5 శాతం మాత్రమే యుద్ధం ప్రభావం చూపుతుందని తెలిపింది.

ఇక పాకిస్థాన్ పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధికార వర్గాలతో ప్రధాని మోదీ.. భేటీ అవుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలతో సమావేశం అయ్యారు. వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు సింధూ జలాల రద్దుతోపాటు, వీసాల జారీ రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.












Click it and Unblock the Notifications