షీనా కేసు: ఆధారాలుమాయం!ఇంద్రానీ షాకింగ్ సీక్రెట్స్

ముంబై: షీనా బోరా హత్య కేసులో నిమిషానికో కొత్త విషయం వెలుగు చూస్తోంది. సినిమా థ్రిల్లర్‌ను తలపిస్తోంది. షీనా బోరాను హత్య చేసి కాల్చి, పూడ్చిపెట్టిన ప్రదేశం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గులాబీ రంగు వస్త్రం, ఒక దంతం, కుడి చేతి ఎముక ఏమయ్యాయో అంతుబట్టడం లేదు.

ఆ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసు రికార్డుల్లో ఉంది. ల్యాబ్ అధికారులు మాత్రం తమకు అలాంటిదేమి రాలేదని చెబుతున్నారు.

దీంతో, నిందితురాలు అయిన ఇంద్రానీయే తన పలుకుబడిని ఉపయోగించి ఆధారాలు మాయం చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాయ్ గఢ్ జిల్లా పేన్ తాలుకా గగోబె బద్రుక్ గ్రామస్తులు 2012 మే 23న పోలీసులకు ఓ పిర్యాదు చేశారు. గ్రామం సమీపంలో అటవీ ప్రాంతం నుంచి దుర్వాసన వస్తోందని చెప్పారు. పోలీసులు అక్కడకు వెళ్లి ఓ వస్త్రం, దంతం, ఎముకలను స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

More secrets about Indrani Mukerjea

ఇప్పుడు, ఇంద్రానీ డ్రైవర్ వాంగ్మూలంతో షీనా బోరా హత్య బయటపడింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల గురించి తెలిసింది. దీంతో ముంబై పోలీసులు వెంటనే పేన్‌కు వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళ్తే అక్కడ ఆధారాలు లేవు. 2012 ల్యాబ్ ఇంఛార్జిగా పని చేసిన వారిని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.

ఇంద్రానీ ఓ రహస్యం!

హీనా బోరా హత్య కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చాలామంది గూగుల్ సెర్చ్‌లో ఇంద్రానీ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆమె చిన్ననాటి గురించి, తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలనుకున్నారు. కానీ అలాంటివేవీ కనిపించలేదు. తద్వారా ఆమె తన గురించిన విషయాలు సీక్రెట్‌గా ఉంచారని అర్థమౌతోంది.

మరో షాకింగ్ విషయం కూడా తెలుస్తోంది. ఇంద్రానీ దుర్గారాణి, ఉపేంద్ర కుమార్ బోరాల కన్న కూతురు కాదని తెలుస్తోంది. వారు ఆమెను పెంచుకున్నారని సమాచారం. వారికి పెళ్లైన కొద్ది రోజుల తర్వాత ఆమెను దత్తత తీసుకున్నారని పక్కింటి వారు చెబుతున్నారు.

మరో షాకింగ్ పుకారు ఏమంటే... ఇంద్రానీకి పెళ్లి కాకమందే షీనా జన్మించిందని. క్లోజ్ రిలేటివ్ వల్ల షీనా పుట్టినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంద్రానీ మొదటి భర్త సిద్ధార్థ దాస్, రెండో భర్త సంజీవ్ ఖన్నా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+