నల్లధనం తగ్గించేందుకు మరిన్ని చర్యలు, వారికి భయమొద్దు: జైట్లీ

న్యూఢిల్లీ: 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పదిహేను శాతం పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. సోమవారం నాడు ఢిల్లీలో ఆదాయ పన్ను శాఖ అధికారులతో జైట్లీ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పన్ను పరిమితులను పెంచాలనుకుంటున్నట్లు చెప్పారు. వసూలైన పన్ను మొత్తాలను మౌలిక సదుపాయాలలో పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు జైట్లీ తెలిపారు.

 More steps on curbing black money on anvil, says Finance Minister Arun Jaitley

దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికంగా పన్నులు వసూలు చేస్తేనే ప్రభుత్వ పథకాలకు అధిక నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్నారు.

నల్లధనంపై మాట్లాడుతూ... నల్ల ధనాన్ని వెనక్కి తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జైట్లీ చెప్పారు. నల్లధనం తగ్గించేందుకు మరిన్ని చర్యలు చేపడతామన్నారు. అయితే, పన్నులు సక్రమంగా కడుతున్న వారు ఎలాంటి భయానికి గురి కావొద్దని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+