Himachal : హిమాచల్ వరదలకు 20 మందికి పైగా మృత్యువాత-ఇవాళ కొట్టుకుపోయిన ఏడుగురు..

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలకు తోడు ఆకస్మిక వరదలు పోటెత్తుతున్నాయి. గత 24 గంటల్లోపే మూడోసారి పడిన భారీ వర్షంతో ఆకస్మిక వరదలు వచ్చి ఏడుగురు కొట్టుకుపోయారు. మండీ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ను స్వయంగా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయన్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా 21 మంది మరణించారు. సంభాల్, పండోహ్ జిల్లా మండిలో వరదలకు సంబంధించి బయటికి వచ్చిన దృశ్యాలు కలవరపరిచేలా ఉన్నాయి. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రస్తుతం యాక్టివ్ రెస్క్యూ, సెర్చ్, రిలీఫ్ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని సీఎం ట్వీట్ చేశారు. దీంతో రాష్ట్రంలో నెలకొన్న వరదల పరిస్ధితి తీవ్రత అర్దమవుతోంది. సీఎం సుఖు పోస్ట్ చేసిన వీడియోలో నీరు భారీ శక్తితో కిందకు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే వీడియో తీస్తున్న కెమెరా వెనుక ఉన్న వ్యక్తి బాధతో కూడిన స్వరంతో "ఓ గాడ్" అని పదే పదే అరవడం వినిపించింది.

himachal floods

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా రెండు వేర్వేరు ఘటనల్లో 16 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.గత రాత్రి సోలన్ జిల్లాలో క్లౌడ్‌బర్స్ట్ ఘటనలో ఏడుగురు మరణించగా, సిమ్లా నగరంలోని సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయం వద్ద కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మరణించారు. ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని కోరారు. కాలువలు, నదుల దగ్గరకు వెళ్లవద్దని సూచించారు.

కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల నుండి ప్రజలను దూరంగా వెళ్లాలని సీఎం సుఖ్వీందర్ స్ధానిక ప్రజల్ని కోరారు. ఈ సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని సందర్శించవద్దని పర్యాటకులను అభ్యర్థించారు. సిమ్లా నగరంలో రెండు కొండచరియలు విరిగిపడటంతో 15 నుంచి 20 మంది వరకు సమాధి అయ్యారని సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేగి ప్రకటించారు. ఇతర సైట్ ఫాగ్లీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ వర్షాలకు అనేక ఇళ్లు మట్టి, బురద కింద ఖననం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+