28 హత్యలు, నాలుగు రాష్ట్రాల్లో కేసులో, బెంగళూరులో చిక్కాడు కిరాయి హంతకుడు!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: నాలుగు రాష్ట్రాల్లో 28కి పైగా హత్యలు, దోపిడీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న నోటోరియస్ కిల్లర్ ను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ అలియాస్ టీను అనే కిరాయి హంతకుడు గురువారం బెంగళూరు పోలీసులకు చిక్కిపోయాడు.

బెంగళూరులోని మెజస్టిక్ సమీపంలోని రైల్వేస్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న దీపక్ అలియాస్ టీను మీద పోలీసులు నిఘా వేశారు. దీపక్ అలియాస్ టీను కదలికలపై అనుమానం రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

More than 28 murder accuse Notorious supari killer arrested in Bengarluru

నాలుగు రాష్ట్రాల పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు. హరియాణలోని అంబాల సెంట్రల్ జైల్లో పోలీసుల మీద కాల్పులు జరిపిన దీపక్ అలియాస్ టీను అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పరారైనాడు.

ఉత్తర భారతదేశంలో పేరుపోందిన కిరాయి హంతకుడు లారెన్స్ బిస్పాయి అనుచరుడు అయిన దీపక్ మీద నాలుగు రాష్ట్రాలో 28కి పైగా హత్యలు, దోపిడీల కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరులోని కాటన్ పేట పోలీస్ స్టేషన్ లో దీపక్ అలియాస్ టీను మీద కేసు నమోదు చేసిన సీసీబీ పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
More than 28 murder accuse Notorious supari killer arrested in Bengarluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి