Jammu & Kashmir Assembly Election 2024: జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతంగా ముగిసిన మూడో దశ పోలింగ్..

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం మూడో దశ పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకు 65.5 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. మొత్తం 90 సీట్లు ఉన్న జమ్మూకాశ్మీర్ మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించారు. మొదటి దశ సెప్టెంబర్ 18న జరిగింది. తొలి దఫాలో 65.4 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక రెండో దశ సెప్టెంబర్ 25 జరిగింది. రెండో దఫాలో 57.31 ఓటింగ్ శాతం నమోదు అయింది.

చివరి దశ ఈ రోజు జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఏడు జిల్లాల్లోని 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మూడో దశలో 415 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్, పలువురు మాజీ మంత్రులు పోటీలో ఉన్నారు. ఉధంపూర్ జిల్లాలో అత్యధికంగా 72.91% పోలింగ్ నమోదు కాగా. సాంబా 72.41, కథువా 70.53, జమ్ము 66.79, బండిపోరా 63.33, కుప్వారా 62.76, బారాముల్లా 55.73 శాతం పోలింగ్‌ నమోదైంది.

More than 65 percent polling has been recorded in the third phase of election polling in Jammu and Kashmir

జమ్మూ జిల్లాలోని 11 సెగ్మెంట్లలో బిష్నా (SC) 72.75%, సుచేత్‌గఢ్ (SC) 68.02%, R S పురా-జమ్ము సౌత్ 61.65%, బహు 57.07%, జమ్మూ ఈస్ట్ 60.21%, జమ్ము 731%, జమ్ము 62.94%, పశ్చిమ 62.94 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉధంపూర్ జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో ఉదంపూర్ వెస్ట్‌లో 73.20%, ఉధంపూర్ ఈస్ట్‌లో 74.07%, చెనానిలో 73.79%, రామ్‌నగర్ (ఎస్సీ) 70.38% పోలింగ్ నమోదైంది.

బారాముల్లా జిల్లాలోని ఏడు స్థానాల్లో సోపోర్ 41.44%, రఫియాబాద్ 58.39%, ఉరి 64.81%, బారాముల్లా 47.95%, గుల్‌మార్గ్ 64.19%, వాగూరా-క్రీరీ 56.43%, పట్టాన్ 60.87% నమోదయ్యాయి. అక్టోబర్ 8న ఫలితాలు విడుదల చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేశారు. అప్పటి నుంచి అక్కడ ఎన్నికలు జరగలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+