కరోనా మృతుల్లో పురుషులే అధికం .. గణాంకాల ప్రకారం ముఖ్యంగా ఆ వయసువారికే డేంజర్ !!
ఇండియాలో కరోనా వైరస్ మహమ్మారి వినాశనం సృష్టిస్తూనే ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. రికవరీ రేటు పెరగటంతో మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని అధికారిక అంచనా. అయితే కరోనా మరణాలు కూడా మనదేశంలో 60 వేల దాకా నమోదయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లోనే కరోనా మహమ్మారి కారణంగా 1059 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 59,449 కి చేరింది.

మరణాల రేటు తగ్గుముఖం , కరోనా నుండి కోలుకుంటున్న రేటు 76.29 శాతానికి పెరుగుదల
ఇదిలా ఉంటే మరణాల రేటు క్రమంగా తగ్గుతుందని, ప్రజలు కోలుకుంటున్న సంఖ్య ఎక్కువగా పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది . భారత దేశంలో ఎక్కువ మంది కరోనామహమ్మారి బారిన పడినప్పటికీ కోలుకుంటున్న శాతం ఎక్కువగా ఉండటంతో ఇది కాస్త ఊపిరి తీసుకుని అంశంగా కనిపిస్తోంది. భారతదేశంలో రికవరీ రేటు 76.29 శాతానికి పెరిగినట్లుగా తెలుస్తుంది.
7 రోజుల సగటు ఆధారంగా ఆగస్టు మొదటి వారంలో కోవిడ్ -19 పాజిటిటీ రేటు 11 శాతం నుండి ఇప్పుడు 8 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖా కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

మరణాలలో 69% పురుషులు , 31% స్త్రీలు
45-60 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో 36% మరణాలు నమోదు అయినట్టు, 60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 51% మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖా కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. 26-44 సంవత్సరాల వయస్సులో 11% మరణాలు మరియు 18-25 సంవత్సరాల వయస్సులో 1% మరణించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ -19 మరణాలలో 69% పురుషులు మరియు 31% స్త్రీలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దీనిని బట్టి కరోనా బారిన పడి మృతి చెందుతున్న వారిలో అధిక శాతం పురుషులే అన్నది అర్ధం అవుతుంది.

60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు వారికే రిస్క్
ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.8% గా ఉంది. కరోనా బారిన పడిన వారి మరణాల గణాంకాలను విశ్లేషిస్తే కరోనా మృతుల 60 ఏళ్లు పైబడిన వయస్సు ఉన్న వారే అధికంగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కరోనా వైరస్ సోకితే వారికే అధికంగా రిస్క్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక పురుషుల్లోనే అధిక భాగం మృతి చెందినట్లుగా గణాంకాలను బట్టి స్త్రీల కంటే పురుషులకే కరోనాతో రిస్క్ ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇండియాలో కరోనా డిసెంబర్ 3 నుండి తగ్గుముఖం పడుతుందని ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే . ఇలాంటి సమయంలో కరోనా తగ్గటం కోసం ఎదురు చూస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హై రిస్క్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి .












Click it and Unblock the Notifications