Mother: తల్లిని దారుణంగా చంపేసిన కూతుర్లు, శవం పక్కన బిస్కెట్లు తింటూ ఆడుకున్నారు !
చెన్నై/ తిరునల్వేలి: మతిస్థిమితం లేని ఇద్దరు కూతుర్లను తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. సుమారు 20 ఏళ్ల వచ్చిన కూతుర్లు ఏమి చేస్తున్నారో వారికే తెలీకుండా జీవిస్తున్నారు. మతిస్థిమితం లేని కూతర్లతో వేగలేక తండ్రి భార్య, పిల్లలను వదిలేసి అతని దారి అతను చూసుకున్నాడు. ఆ ఇద్దరు కూతుర్ల చేతిలోనే తల్లి దారుణ హత్యకు గురైయ్యింది. తల్లిని చంపేసిన కూతుర్లు శవం పక్కనే ఆడుకున్నారు. తల్లి శరీరంలోని రక్తం కారిపోయి ఇళ్లంతా తడిచిపోవడంతో అదే రక్తంలో ఇద్దరు కూతుర్లు ఆడుకోవడం కలకలం రేపింది.

మతిస్థిమితం లేని కూతుర్లు
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉషా అనే మహిళ నివాసం ఉంటోంది. ఉషాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఉషా ఇద్దరు కూతుర్లకు మతిస్థిమితం లేదు. మతిస్థిమితం లేని ఇద్దరు కూతుర్లను ఉషా కంటికిరెప్పలా కాపాడుకుంటున్నది. తల్లి ఉషా చేసిపడుతున్న భోజనం తింటూ కూతుర్లు కాలం గడిపేస్తున్నారు.

జెండా ఎత్తేసిన భర్త
మతిస్థిమితం లేని కూతర్లతో వేగలేక తండ్రి భార్య ఉషాను, పిల్లలను వదిలేసి అతని దారి అతను చూసుకున్నాడు. భర్త వదిలేసి వెళ్లిపోవడంతో ఉషా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో పనులు లేక లేనిపోని కష్టాలు పడుతూ ఆమె కూతుర్లను పోషిస్తోంది. చుట్టుపక్కల నివాసం ఉంటన్న పాఠశాల విద్యార్థులకు ట్యూషన్లు చెబుతున్న ఉషా చాలిచాలని డబ్బులు రావడంతో కష్టంమీద సంసారాన్ని నెట్టుకుని వస్తోంది.

అనుమానం వచ్చి కిటికీలో చూస్తే ?
రాత్రి ఇంట్లోకి వెళ్లిన ఉషా మరుసటి రోజు మద్యాహ్నం అయినా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి కిటికీలో చూశారు. ఇంట్లో ఉషా రక్తపుమడుగులో పడిఉండటం, రక్తం ఇళ్లాంతా అయిపోయినా పట్టించుకోకుండా ఆ రక్తంలో బోమ్మలో ఉషా కూతుర్లు ఆడుకుంటున్న విషయం గుర్తించారు. ఒక అమ్మాయి బయటకు వచ్చి మా అమ్మ చనిపోయింది అని చెప్పడంతో స్థానికులు హడలిపోయి నెల్లయ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తల్లిని కర్రలతో కొట్టి పొడిచి చంపిన కూతుర్లు
తల్లి ఉషాను తామే కర్రలతో కొట్టి పొడిచి చంపేశామని ఓ అమ్మాయి చెప్పిందని పోలీసులు అన్నారు. అయితే మతిస్థిమితం లేని కూతుర్లును అరెస్టు చెయ్యకుండా పోలీసులు ఇద్దరిని మెడికల్ కాలేజ్ కు పంపించి చికిత్స చేయిస్తున్నారు. చికిత్స చేయించిన తరువాత వారి స్టేట్ మెంట్ తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు. తల్లిని చంపేశామని ఎలాంటి బాధలేకుండా ఉషా కూతుర్లు ఇద్దరు శవం పక్కనే బిస్కెట్లు తింటూ ఆడుకుంటున్నారని పోలీసులు అన్నారు.












Click it and Unblock the Notifications