బంపర్ ఆఫర్, కూతురు ప్రెసిడెంట్, అమ్మ వైస్ ప్రెసిడెంట్, కిక్కు అంటే ఇదేరా !
బెంగళూరు/చిక్కమగళూరు: ఢిల్లీ రాజకీయాల కంటే గ్రామాల్లో రాజకీయాలు చెయ్యడం చాలా కష్టం. పార్టీ బ్యానర్‌లో ఎంపీలు, ఎమ్మెల్యే ఏదైనా కావచ్చు. కానీ గ్రామ రాజకీయాల్లో సభ్యత్వం పొందడం కష్టం. పంచాయతీకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కావడం మరింత కష్టం. అలాంటప్పుడు తల్లీ కూతురు ఒకే గ్రామ పంచాయతీకి ప్రెసిడెంట్‌గా ఒకరు, వైస్ ప్రెసిడెంట్ గా ఒకరు ఎన్నిక అయితే ఆ కిక్కు ఎలా ఉంటుందో మీరే చూడండి.
ఒకే గ్రామ పంచాయితీకి తల్లీకూతుర్లు నాయకులు అయిన అరుదైన ఘటనకు సాక్షి కర్ణాటకలోని కాఫీనాడు చిక్కమగళూరులో జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూర్ తాలూకాలోని గర్జే గ్రామానికి చెందిన 20 ఏళ్ల స్నేహ గ్రామ పంచాయతీ చైర్‌పర్సన్‌గా, ఆమె తల్లి నేత్రవతి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక అయ్యారు. గార్జే -జి.మాదాపుర రెండు గ్రామాలతో కలిపి ఒక పంచాయతీగా చేశారు. ఈ పంచాయితీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఎన్నిక అయ్యారు.

గత ఎన్నికల్లో అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా మరొ ఇద్దరు ఉన్నారు. ఈసారి అధ్యక్ష పదవి మహిళా జనరల్‌కు దక్కింది. ఉపాధ్యక్ష పదవి బీసీఎం మహిళకు దక్కింది. ఏడుగురు సభ్యుల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏడుగురిలో ముగ్గురు ఓ వర్గంగా, నలుగురు మరో వర్గంగా విడిపోయారు. ఈ వ్యతిరేకత ఉన్నప్పటికీ తల్లీకూతుళ్లకు అధ్యక్ష పదవి, ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేసి విజయం సాధించారు.
అధ్యక్ష పదవి, ఉపాధ్యక్ష పదవులు దక్కడంతో తల్లీకూతుళ్లిద్దరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము గెలుస్తామన్నది కలగా ఉందని. అదృష్టంతో గెలిచామని, ఇద్దరూ ఒకేసారి అధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక అవుతామని కలలో కూడా అనుకోలేదని తల్లీకూతురు అన్నారు. పంచాయితీ ఉపాధ్యక్షురాలు నేత్రావతి మాట్లాడుతూ ప్రజలు మామీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముకాకుండా మంచి పనులు చేస్తామని అన్నారు. 5 ఏళ్ల అమ్మ నేత్రావతి వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారు. అయితే 20 ఏళ్ల కూతురు స్నేహా పంచాయితీ అధ్యక్షురాలిగా ఉండడం విశేషం.

జి.మాదాపూర్, గర్జే రెండు గ్రామాల్లో నేత్రావతిని పోటీలో నిలపాలని నిర్ణయించారు. ఇరువర్గాలు గెలిస్తే మళ్లీ ఉప ఎన్నిక వస్తుందని స్నేహ తండ్రి స్నేహితులు స్నేహ పేరుతో నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఎన్నికల్లో తల్లీ కూతురు ఇద్దరూ గెలిచారు. గెలవడం వరంలా భావించిన తల్లీకూతుళ్లు నేడు అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్షురాలు పదివికి ఎన్నిక కావడం పట్ల ప్రజలుఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మొత్తానికి కాఫీనాడు చిక్కమగళూరు అరుదైన ఈఘటనకు సాక్షిగా నిలిచింది. ఎందుకంటే, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకే ఇంటిలో ఒకరు మంత్రిగా. కొందరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ పల్లెటూరి కుల రాజకీయాలలో ఒకే ఇంటిలో తల్లీకూతురు ఇలాంటి పదవుల్లో ఉండటం అరుదుగా జరుగుతుంది, ఇలా గెలవడం కూడా చాలా కష్టం. ఈ పరిస్థితిలో రాజకీయ కురుక్షేత్రంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లు ఇద్దరు అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు కావడం నిజంగా ఒక వండర్ అని స్థానికులు అంటున్నారు. గ్రామస్తుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తల్లీకూతురు నేత్రావతి, స్నేహా అంటున్నారు.












Click it and Unblock the Notifications