లీటరు పాలు ఇంత చీపా..? భారీగా తగ్గనున్న పాల ధరలు.. ఆ రోజు నుంచే అమల్లోకి..
ప్రతి ఇంట్లో నిత్యం పాలు వినియోగిస్తారు. కుటంబ అవసరాలకు సరిపడా పాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే పాల ధరలు భారీగా తగ్గనున్నాయి. మదర్ డెయిరీ సంస్థ పాల ధరను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. తగ్గించిన కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇటీవల 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. సామాన్య ప్రజలకు అనేక వస్తువులపై జీఎస్టీ ను తగ్గిస్తున్నట్లు ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ తగ్గించిన కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయన్నారు.
దసరా, దీపావళి పండగ నేపథ్యంలో దేశంలోని సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జీఎస్టీ తాజా సంస్కరణలతో ప్రస్తుతం ఉన్న 12, 28 శ్లాబులను పూర్తిగా తొలగించారు. కేవలం 5, 18 శాతం శ్లాబులనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చాలా వరకు నిత్యావసర వస్తువులు 5 శాతం శ్లాబులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలో మదర్ డెయిరీ సంస్థ తమ కస్టమర్లకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. తమ పాల ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. పాలు మాత్రమే కాకుండా నెయ్యి.. తదితర అనేక ఉత్పత్తులపై ప్రభుత్వం జీఎస్టీలో మార్పులకు అనుగుణంగా ధరల తగ్గింపును ప్రకటించింది. రోజువారీ పాల ప్యాకెట్ల ధర తగ్గింపు వివరాలు చూస్తే.. లీటర్ టోన్డ్ టెట్రా ప్యాక్ ధర రూ.77 నుంచి రూ.75 కు చేరింది. అలాగే ఎవ్రీడే పాలీ ప్యాక్ మిల్క్ ఎప్పట్లానే జీఎస్టీ మినహాయింపులు కొనసాగుతాయి. అంతేకాక పనీర్, వెన్న, జున్ను, నెయ్యి, మిల్క్ షేక్, ఐస్ క్రీమ్ ధరలు కూడా తగ్గినట్లు మదర్ డెయిరీ పేర్కొంది. దాంతో 500 గ్రాముల వెన్న ప్యాకెట్ ధర రూ.305 నుంచి రూ.285కు చేరింది. బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్ ధర రూ.35 నుంచి రూ.30కు తగ్గింది.

ఇక ఇటీవల చెన్నైలో చెన్నై సిటిజెన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్యాక్స్ రిఫార్మ్స్ ఫర్ రైజింగ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు విషయాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 12 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్న 99 శాతం వస్తువులను.. ఇతర ఉత్పత్తులను అన్నింటినీ 5 శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారాన్ని తగ్గిస్తుందని అన్నారు. ఆయా నిత్యావసరాల ధరలు తగ్గుతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications