ఒంటరి మహిళను చంపేశారు, చిన్నారని నీటి టబ్‌లో వేసి హత్య
బెంగళూరు: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ, ఆమె 11 నెలల కుమార్తెను దారుణంగా హత్య చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరులోని కామాక్షిపాళ్య సమీపంలోని హౌస్సళ నగరలో నివాసం ఉంటున్న పల్లవి (27), ఆమె నెలల కుమార్తె గురువారం హత్యకు గురయ్యారు.
బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్లాపురంకు చెందిన పల్లవి, బెంగళూరుకు చెందిన బాలాజీకి రెండు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి 11 నెలల కుమార్తె ఉంది. జీవన్ భీమానగరలోని ప్రయివేటు కంపెనీలో బాలాజీ ఉద్యోగం చేస్తున్నాడు.
20 నెలల నుండి వేరే ప్రాంతంలో ఉంటున్న వీరు, మూడు నెలల క్రితం హౌస్సళ నగరలోని అద్దె ఇంటికి మారారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం బాలాజీ ఉద్యోగానికి వెళ్లాడు. ఆ సమయంలో పల్లవి కుమార్తెతో కలిసి ఇంట్లో ఉంది.

మద్యాహ్నం తర్వాత ఇంటిలోకి చోరబడిన నిందితుడు పల్లవి గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం బాత్ రూంలోని టబ్‌లో నీళ్లు నింపి చిన్నారిని తీసుకు వెళ్లి అందులో వేసి హత్య చేసి అక్కడి నుండి పరారయ్యాడు. గురువారం రాత్రి బాలాజీ ఇంటికి వెళ్లాడు.
భార్య, కుమార్తె హత్యకు గురైన విషయం గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బాలాజీ ప్రతి రోజు ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడని పల్లవి గొడవపడేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
పల్లవిని గొంతు నులిమి హత్య చేశారని, చిన్నారిని దారుణంగా నీటి టబ్‌లో ముంచి హత్య చేశారని డీసీపీ లాబూరామ్ చెప్పారు. పల్లవి భర్త పోంతనలేని సమాధానం ఇస్తున్నాడని, అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని శుక్రవారం పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications