ప్రియుడి కోసం కుమార్తెనే కిడ్నాప్ చేసి.. లాడ్జికి తీసుకెళ్లాక!..

మండ్యలోని ఓ లాడ్జిలో బంధించి ఆమె ప్రియుడు మంజుతో కుమార్తెకు వివాహం జరిపించేందుకు ప్రయత్నించింది.

మండ్య: కడుపున పుట్టిన బిడ్డ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించింది ఓ తల్లి. భవిష్యత్తులో కూతురు కిక్కురమనుకుండా ఉండాలంటే.. ప్రియుడితో పెళ్లి చేసి తన గొంతు లేవకుండా చేయాలన్న ఆలోచనకు వచ్చింది. ఇదే ఆలోచనతో ఇంకా పసితనం ఛాయలు కూడా పోని కుమార్తెను(12) ప్రియుడికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయబోయింది.

కర్ణాటకలోని శ్రీరంగపట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కుమార్తె పెళ్లి చేసి తనకెలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలనుకున్న తల్లి.. కన్నబిడ్డనే కిడ్నాప్ చేసింది. మండ్యలోని ఓ లాడ్జిలో బంధించి ఆమె ప్రియుడు మంజుతో కుమార్తెకు వివాహం జరిపించేందుకు ప్రయత్నించింది.

Mother kidnapped her daughter to do marriage

అయితే విషయాన్ని గమనించిన స్థానికులు ఈ పెళ్లికి అడ్డుపడి.. ఆ చిన్నారి జీవితం నాశనం కాకుండా చూశారు. దీంతో తల్లి చెర నుంచి తప్పించుకున్న కుమార్తె బెంగుళూరులోని తన తండ్రి వద్దకు చేరింది. విషయం తెలుసుకున్న తండ్రి పీణ్యా పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు.

పీణ్యా ఫిర్యాదుతో అతని భార్యను, ఆమె ప్రియుడిని ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిద్దరు జైల్లో ఊచలు లెక్కబెట్టుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+