ప్రియుడిపై వ్యామోహం: కుమార్తెను చంపేసింది

బెంగళూరు: ఓ వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ తన బండారం బయటపడటంతో కుమార్తెను జలసమాధి చేసింది. రెండు రోజుల తరువాత తన కుమార్తె నీటి సంప్ లో పడి మరణించిందని అందరిని నమ్మించింది.

అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడి కటకటాలపాలైయ్యింది. బెంగళూరు నగర శివార్లలోని తావరకెరె పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మాగడి రోడ్డు సమీపంలోని బ్యాడరహళ్ళి దగ్గర ఉన్న కెంపేగౌడ నగరలో లత అనే మహిళ నివాసం ఉంటున్నది.

ఈమెకు స్మిత (8) అనే కుమార్తె ఉంది. స్మిత ప్రయివేటు స్కూల్ లో మూడవ తరగతి చదువుతున్నది. మూడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో లత భర్త మరణించాడు. లత ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. రమేష్ అనే వ్యక్తితో లత అక్రమ సంబంధం సాగిస్తున్నది.

ప్రతినిత్యం రమేష్ లత ఇంటికి వెళ్లేవాడు. ఒక సారి బెడ్ రూంలో లత, రమేష్ రహస్యంగా గడుపుతున్న విషయం స్మిత గుర్తించింది. అప్పటి నుండి ఆ అంకుల్ ఎవరు అని తన తల్లి స్మితను అడుగుతున్నది. తన విషయం బయటపడుతుందని లత భయపడింది.

Mother Latha killed her 8- year- old daughter Bengaluru City.

సెప్టెంబర్ 1వ తేదిన ఇంటి ముందు ఆడుకుంటున్న కుమార్తె స్మితను పక్కనే ఉన్న నీటి సంప్ లో తొసి పైన డోర్ మూసేసింది. మరుసటి రోజు తన కుమార్తె కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరువాత తన కుమార్తె నీటి సంప్ లో పడి మరణించిందని చుట్టు పక్కల వారిని నమ్మించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గుట్టుచప్పుడు కాకుండ పోలీసులు లత నివాసం ఉంటున్న ప్రాంతంలో చుట్టుపక్కల వారిని నుండి వివరాలు సేకరించారు.

రమేష్, లత అక్రమ సంబంధం బయటపడటంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో లత తన కుమార్తెను హత్య చేశానని అంగీకరించడంతో జైలుపాలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+