నా కొడుకే రేప్ చేశాడు: పోలీసులకు ఓ తల్లి ఫిర్యాదు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, తన కొడుకే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని నిందితుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమె నిందితుడైన తన కొడుకును అరెస్ట్ చేసి శిక్షించాలని కోరగడం గమనార్హం.
తప్పు చేస్తే కన్న కొడుకునైనా శిక్షించాలనే విషయాన్ని ఆ తల్లి ఆచరించి చూపింది. పోలీసుల కథనం ప్రకారం.. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ వద్ద నజీర్ షేక్ అనే యువకుడు మరో ముగ్గురితో కలిసి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

స్కూల్‌లో టాయ్‌లెట్ మూసివేయడంతో ఒకటో తరగతి విద్యార్థి(7)ని బయటకు వెళ్లింది. ఆ సమయంలో నాజిర్, అతని స్నేహితులు ఆ చిన్నారిని పొదలచాటుకు లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి పోవడంతో ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు.
కాగా, ఇంటి కెళ్లిన నజీర్ మద్యం మత్తులో అత్యాచారం విషయం గురించి మాట్లాడాడు. ఈ విషయం తెలిసిన వెంటనే నజీర్ తల్లి అనూర్ బీబీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అంతేగాక సంఘటన స్థలానికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించింది. అనూర్ బీబీ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications