ఢిల్లీలో దారుణం: అత్తమీద కోపంతో రెండేళ్ల కొడుకును..
క్షణికావేశంలో సహనం కోల్పోయిన ఓ తల్లి తన కర్కశత్వాన్ని రెండేళ్ళ కొడుకుపై ప్రదర్శించింది. ఇంట్లో నిద్రిస్తున్న కొడుకును తీసుకెళ్ళి మెట్లపై నుంచి విసిరేసింది.
న్యూఢిల్లీ: అత్త మీద కోపం దుత్త మీద చూపించడమంటే ఇదే. క్షణికావేశంలో సహనం కోల్పోయిన ఓ తల్లి తన కర్కశత్వాన్ని రెండేళ్ళ కొడుకుపై ప్రదర్శించింది. ఇంట్లో నిద్రిస్తున్న కొడుకును తీసుకెళ్ళి మెట్లపై నుంచి విసిరేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం సోషల్ మీడియాలో నెటిజన్లను విస్మయపరుస్తోంది.
దేశ రాజధానిలోని పుల్ ప్రహ్లాద్ పూర్ లో గత శనివారం చోటుచేసుకున్న ఈ దారుణానికి సంబంధించి పోలీసులకు ఆలస్యంగా మంగళవారం సాయంత్రం ఫిర్యాదు అందింది. ఈ మేరకు భర్త నితిన్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడి భార్య సోనూ గుప్తా (26) పై హత్యాయత్నం కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంట్లో అత్తతో గొడవపడి సోనూ గుప్తా ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముఖం, తలకు తీవ్ర గాయాలైన రెండేళ్ళ అన్షూ గుప్తా ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.
ఆస్తి వ్యవహారానికి సంబంధించి వాగ్వాదంతో ఊగిపోయిన సోనూ గుప్తా ఈ చర్యకు పాల్పడిందని, గతంలోనూ తమ మనవడిని శారీరకంగా హింసించిన తమ కోడలు అందుకు తమను బాధ్యులుగా చేసి ఆరేపణలు చేసేదని, దీంతో ఆమె ఆట కట్టించేందుకు ఇంట్లో తాము సీసీ కెమెరాలు అమర్చాల్సి వచ్చిందని నితిన్ తల్లి పేర్కొన్నట్లు పోలీసులు వివరించారు.












Click it and Unblock the Notifications