కోట్ల రూపాయ‌ల ఉద్యోగం వదులుకొని... ఎన్నిక‌ల బ‌రిలో..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో న‌వంబ‌ర్ 17 న ఎన్నిక‌లు జ‌ర‌గునున్నాయి. ఇప్ప‌టికే బిజెపి, కాంగ్రెస్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసింది. ఈ త‌రుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల బ‌రిలో దిగే త‌మ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌వేశ‌పెట్టింది. అయితే, ఈ నేప‌థ్యంలోని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పోటీచేసే ఓ ఆప్ అభ్య‌ర్థి పేరు ఇప్పడు చ‌ర్చానీయాంశంగా మారింది. ఆ పేరు ప్ర‌ఖ‌ర్ ప్ర‌తాప్ సింగ్‌. ఈయ‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గుఢా శాస‌న‌స‌భా స్థానం నుంచి ఆప్ అభ్య‌ర్థిగా పోటీచేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ యువ‌కుడి పేరు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాత కూడా సామాజిక కార్య‌క‌ర్తే : ప్ర‌తాప్‌సింగ్‌ రాయ్‌పూర్ కర్చులియన్ గ్రామ నివాసి. ప్ర‌తాప్ సింగ్ తండ్రి పేరు భాను ప్రతాప్ సింగ్. ఈయ‌న ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌.. ప్ర‌తాప్ సింగ్ తాత నిర్మ‌ల్‌సింగ్ ఈ ప్రాంతంలో సామాజిక కార్యకర్తగా చాలా ఏళ్ల‌పాటు ప‌నిచేశారు. రాయ్‌ఫూర్‌లో ప్ర‌తాప్‌సింగ్ ఎంతో చురుకుగా ప‌నిచేశారు. ఆయ‌న ప‌నిత‌నం మెచ్చిన‌ ఆమ్ ఆద్‌పార్టీ ఆయ‌న‌కు సీటును ఖరారుచేసింది. రాజకీయాలే గమ్యంగా పెట్టుకున్న ఆయన ఆ దిశగా త‌న ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టాడు. ప్ర‌తాప్ సింగ్ రాజ‌కీయాల్లోకి రాక‌ముందు అమెరికాలో రూ. కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం చేసేవాడు. కొన్ని రోజుల క్రితం అమెరికా నుంచి త‌న గ్రామానికి వ‌చ్చి, ఆమ్ ఆదీ పార్టీలో చేరాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ ఈ యువ‌కుడికి ఎంపీలోని గుఢా శాస‌న‌స‌భా టిక్కెట్‌ను ఇచ్చింది.

MP assembly election 2023: Know about the AAP candidate Pratap Singh who left high earning job

డెహ్రాడూన్‌లోనే విద్యాభాస్యం : ప్ర‌తాప్ ఐదవ తరగతి వ‌ర‌కు డెహ్రాడూన్‌లో విద్యాభాస్యం పూర్తిచేశాడు. ఆ త‌ర్వాత మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్ పూర్తికాగానే పై చ‌దువుల‌కు అమెరికా వెళ్లాడు. అక్కడ ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత రెండేళ్లు అమెరికాలో పనిచేశారు. చిన్న‌ప్ప‌టి నుంచే సామాజిక సేవ కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొనేవారు ప్ర‌తాప్‌. ఆ కార‌ణంతో అమెరికాను వ‌దిలి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చేసారు. ఇండియా వ‌చ్చిన త‌ర్వాత త‌న తండ్రి కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా ప‌నిచేశాడు. ప‌దిహేనేళ్ల వ‌య‌సులో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ప్ర‌తాప్ సింగ్ పాతికేళ్ల‌లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

కోట్ల రూపాయల ప్యాకేజీలు ప్ర‌తాప్‌సింగ్‌కు ఎలాంటి సంతృప్తినివ్వ‌లేదు. రాష్ట్రం కోసం ఏదైనా చేయాలనే త‌ప‌న‌తో ప్రతాప్ సింగ్ అన్నీ వదిలేసి రెండేళ్ల క్రితం మ‌ధ్య‌ప్రదేశ్‌కు వచ్చారు. ఇప్పుడు గూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్నారు. ఈ ఎన్నిక‌ల్లో అనుభవజ్ఞులను ఓడించేందుకు ఆయన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆ గ్రామంలో వీధీ వీధి తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయ‌న టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+