అవమానం: బిజెపి అభ్యర్థి మెడలో బూట్ల దండ వేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu
  బిజెపి అభ్యర్థి మెడలో బూట్ల దండ, వీడియో

  భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బిజెపి నేతకు తీవ్రమైన అవమానం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి మెడలో ఓ వ్యక్తి బూట్ల దండ వేశాడు. ఆ షాక్ నుంచి తేరుకున్న అతను సర్దుకునే ప్రయత్నం చేశారు.

  అది వారి కోపం మాత్రమేనని, తననుంచి వారు ఏదో కోరుకుంటున్నారని, అందుకే తమ అసంతృప్తిని అలా వ్యక్తం చేశారని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి నేత దినేష్ శర్మ అన్నారు. ఆయను స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్ ధన్మోద్ నుంచి పోటీ చేస్తున్నారు.

  MP: BJP civic poll candidate made to wear garland of shoes

  తానెప్పుడూ వారి బిడ్డనేనని, వారి అవసరాలు తీర్చేందుకు మరింత బాగా పనిచేస్తానని అన్నారు. ప్రచారానికి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి చెప్పులతో దండను తీసుకొచ్చి వేయబోయాడు. దీంతో ఆయన వాటిని పక్కకు పడేసేందుకు ప్రయత్నించారు.

  ఆ వ్యక్తి పట్టు వీడలేదు. దీంతో బిజెపి నేత చెప్పుల దండ వేయించుకున్నాడు. ఆ తర్వాత ఆ దండ వేసిన వ్యక్తి మాట్లాడారు. తమ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉందని, ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకే తాను అలా చేశానని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  candidate for civic polls from Dhar Dhamnod, who was made to wear a garland of shoes by an elderly man, said "they are one of my own."

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి