తుపాకితో బెదిరించి మంత్రి, ఆయన భార్యను దోచుకున్నారు
న్యూఢిల్లీ: ఓ రాష్ట్ర మంత్రికే దిక్కు లేకుండా పోయింది. దుండగులు తుపాకులతో బెదిరించి మధ్య ప్రదేశ్ రాష్ట్ర మంత్రి జయంత్ మాలైయాను, ఆయన భార్యను దోచుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో గల కోసి కలాన్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి జబల్పూర్ - నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఢిల్లీ వస్తున్నపుడు వారు దోపిడీకి గురయ్యారు. తమ నగదును, విలువైన వస్తువులను ఎత్తుకుని దుండగులు పారిపోయినట్లు మంత్రి సతీమణి సుధా మలైయా చెప్పారు.
పది, పన్నెండు మందితో కూడా సంఘటితమైన గ్రూప్ తమను బెదిరించి ఈ దోపిడీకి పాల్పడినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైలు మధుర మీదుగా పోతుండగా తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది.

చాలా గట్టిగా ఆగంతకులు తలుపు తట్టారు. దాంతో ఏమైనా అత్యవసరం పడి తలుపు తడుతున్నారనే ఉద్దేశంతో తాము తలుపు తెరిచినట్లు సుధ చెప్పారు. వెంటనే ఐదుగురు సాయుధులు లోనికి ప్రవేశించగా, మరో ఐదుగురు బయట కాపలాగా ఉన్నారు. ఆర్‌పిఎఫ్ బలగాలు వారిని ఎదుర్కోవడానికి బదులు సరైన ఆయుధాలు లేకపోవడంతో వెనక్కి పారిపోయినట్లు తెలుస్తోంది.
ప్రయాణికులను చాలా మందిని దుండగులు దోచుకున్నట్లు చెబుతున్నారు. ప్రయాణికుల వద్ద ఉన్న విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని చెబుతున్నారు. ఢిల్లీకి చేరుకున్న వెంటనే మంత్రి జయంత్ నేరుగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు వద్దకు వెళ్లారు. ఈ దోపిడీ సంఘటనను ప్రహ్లాద్ పటేల్ లోకసభలో ప్రస్తావించారు. ముగ్గురు ఆర్‌పిఎఫ్ అధికారులను సస్పెండ్ చేశఆరు.












Click it and Unblock the Notifications