ఎంపీలకు కేంద్రం తీపి కబురు: భారీగా పెంచిన అలవెన్సులు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎంపీలకు ఇచ్చే అలవెన్సులు పెంచాల్సిందిగా చేసిన ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎంపీలకు నియోజకవర్గ అలవెన్సులతో పాటు ఫర్నీచర్‌, కమ్యూనికేషన్‌ అలవెన్సులను పెంచాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతిపాదన చేసింది.

 MPs monthly allowances to increase by Rs40,000

ఈ ప్రతిపాదన ప్రకారం ఎంపీలకు ఇచ్చే నియోజకవర్గ అలవెన్సులు ప్రస్తుతం రూ.45వేలు ఇస్తుండగా.. వాటిని రూ.60వేలకు పెంచాల్సిందిగా సూచించింది. దీంతో పాటు వన్‌ టైమ్‌ ఫర్నీచర్‌ అలవెన్సులను కూడా రూ.75వేల నుంచి లక్ష రూపాయలకు చేయాల్సిందిగా ప్రతిపాదనలో పేర్కొంది. ఇందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించింది.

కాగా, అలవెన్స్‌ల పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.39 కోట్ల అదనపు భార పడనున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్‌ ప్రసంగం సమయంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. ఎంపీల వేతనాలకు సంబంధించి శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎంపీల బేసిక్‌ వేతనం నెలకు రూ.50వేలు. ఎంపీ కోసం నెలకు కేంద్రం రూ.2.7లక్షల చొప్పున ఖర్చు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+