వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్త్రీలను గౌరవించు: మోడీపై రాహుల్ నిప్పులు

By Pratap
|
Google Oneindia TeluguNews

వారాణసి: రోడ్ షో తర్వాత వారణాసిలో కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. నేరుగా మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో ఆయన శనివారంనాడు రోడ్ షో నిర్వహించి ఆ తర్వాత ప్రసంగించారు.

"మోడీజీ దయచేసి పద్ధతి మార్చుకోండి. మహిళలను గౌరవిస్తానని చెప్పండి. గుజరాత్‌లో పోలీసులను పంపడాన్ని, మహిళల ఫోన్లు ట్యాప్ చేయడాన్ని ఆపేయండి. వారికి శక్తి కాదు, గౌరవం ఇవ్వండి" అని రాహుల్ గాంధీ అన్నారు.

Mr Modi, Give Women Respect: Rahul Gandhi In Varanasi

ఓపెన్ కారులో రాహుల్ గాంధీ వారణాసిలో రోడ్ షో నిర్వహిచారు. పేదలకు, సంపన్నులకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి కాంగ్రెసు ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. తమ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్‌ని గెలిపించాలని ఆయన కోరారు.

జీవించు, ప్రేమించు, శాంతంగా ఉండు అనే బౌద్ధాన్ని కాంగ్రెసు పార్టీ అనుసరిస్తుందని ఆయన చెప్పారు. భారత వైమానిక దళానికి గుజరాత్‌లో మోడీ భూమి ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అతి తక్కువ ధరకు మోడీ ఆదానీ 45 వేల ఎకరాల పేదల భూమిని కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.

English summary
On the last day of campaigning in the world's largest election, Rahul Gandhi stepped into Narendra Modi's chosen poll battlefield, Varanasi, and targeted him directly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X