సల్మాన్ ఖాన్‌ను అర్ధరాత్రి కలిసిన ధోనీ, సాక్షి: ఎందుకో? (వీడియో)
ముంబై: భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్‌ను కలిశాడు. ముంబైలోని గెలాక్సీ అపార్టుమెంటులో సల్మాన్ ఖాన్‌ను ధోనీ దంపతులు కలిశారు. ఈ కలయిక ఎందుకనే విషయం తెలియరాలేదు.

సల్మాన్ ఖాన్‌ని వారు సోమవారం అర్ధరాత్రి కలిశారు. ధోనీతో పాటు భార్య సాక్షి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణా కూడా ఉన్నారు.ధోనీ కారు రాగానే సల్మాన్ ఖాన్ ఎదురెళ్లి వారిని సగౌరవంగా ఆహ్వానించాడు.
అయితే ధోనీ సల్మాన్‌ని అంత రాత్రి ఎందుకు కలవాల్సి వచ్చింది అన్న విషయాన్ని ఇద్దరూ మీడియాకి వెల్లడించలేదు. మరో పక్క ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ సేన రైజింగ్ పుణె సూపర్‌జైంట్స్ ఏప్రిల్ 14న రాజ్‌కోట్‌లో గుజరాత్ లయన్స్‌తో తలపడనుంది.












Click it and Unblock the Notifications