శరద్ పవార్ ఇంటిపై ఉద్యోగుల దాడి : చెప్పులు- సీసాలు విసురుతూ : సీఎం సీరియస్..!!
ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఇంటి పైన దాడి జరిగింది. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల నిరసన దారి తప్పింది. ఏకంగా పవార్ ఇంటి పైన చెప్పులు, బూట్లు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల పైన ముఖ్యమంత్రి ఉధ్దవ్ థాక్రే ఆగ్రహం వ్యక్తం చేసారు. దాడికి పాల్పడిన ఉద్యోగుల పైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్డికంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో.. ఈ సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.

తీవ్ర రూపం దాల్చిన నిరసనలు
నవంబర్ నుంచే అనేక మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ సమ్మె దారి తప్పింది. నిరసనల్లో పాల్గొంటున్న దాదాపు వంద మంది ఉద్యోగులు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆయనకు వ్యతిరేకంా నానాదాలు చేసారు. ఆయన నివాసం పైన చెప్పులు, బూట్లు విసరడం తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమ్మె ప్రారంభం తరువాత ఇప్పటి వరకు దాదాపు 120 మంది ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేసాయి.

సడన్ గా పవర్ నివాసం ముట్టడి
ఇవి ఆత్మహత్యలు కావని..ప్రభుత్వం చేసిన హత్యలంటూ మండిపడ్డాయి. తమ సయస్య పరిష్కారానికి పవార్ ఇప్పటి వరకు జోక్యం చేసుకోలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, బాంబే హై కోర్టు ఉద్యోగులు సమ్మె విరమించి..ఈ నెల22వ తేదీ లోగా విధుల్లో చేరాలంటూ ఆదేశించింది. అదే సమయంలో తిరిగి విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అనిల్ పరబ్ హామీ కూడా ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు తాము తిరిగి విధుల్లో చేరుతామని ఉద్యోగులు సైతం చెబుతున్నారు. ఇది నిఘా సంస్థల వైఫల్యంగా ఎన్సీపీ ఆరోపిస్తోంది. దీని పైన మహారాష్ట్ర హోం మంత్రి విచారణకు ఆదేశించారు.

సీఎం సీరియస్..చర్యలకు ఆదేశం
కానీ, పవార్ మాత్రం తమ సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకోకపోవటం పైన వారు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరగుతున్న నష్టానికి పవార్ సైతం బాధ్యుతలేని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ ఏర్పాటులో పవార్ కీలకంగా వ్యవహరించారు. కానీ, తాము ఇంత కాలంగా ఆందోళన చేస్తున్నా..పవార్ ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీస్తున్నారు. పవార్ ఇంటి పైన దాడికి ప్రయత్నించిన వారి పైన చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.












Click it and Unblock the Notifications