కోట్లాది ఫోన్ కాల్స్ బ్లాక్ చేశారు, మార్చి 31 వరకు జియో ఉచితం, 5 ని.ల్లో అంతా: అంబానీ

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: జియోకు ఇతర నెట్ వర్క్‌లు సహకరించడం లేదని, 9వేల కోట్ల ఫోన్ కాల్స్‌ను ఇతర ఆపరేటర్లు బ్లాక్ చేశారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉచిత సేవలు కొనసాగిస్తామని, మార్చి 31వ తేదీ వరకు ఉచిత సేవలు పొడిగిస్తున్నామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గురువారం చెప్పారు.

ఈ-కేవైసీ ద్వారా జియో సిమ్‌ కేవలం ఐదు నిమిషాల్లోనే యాక్టివేట్‌ అయ్యేలా చర్యలు తీసుకున్నామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉచిత కాల్స్‌ సదుపాయాన్ని కొనసాగిస్తామన్నారు. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.

 Mukesh Ambani addresses stakeholders via live broadcast

ఇంకా ఆయన ఏం చెప్పారంటే...

- కాగిత రహిత సమాజం కోసం జియోను తీసుకు వచ్చాం
- సాధారణ బ్రాండ్ బాండ్ సేవల కన్నా 25 శాతం అధికంగా జియో సేవలు
- ప్రతి రోజు 6 లక్షళల మంది వినియోగదారులు జియోలో చేరుతున్నారు
- నెంబర్ పోర్టబులిటీని స్వీకరించేందుకు జియో సిద్ధం
- నెంబర్ పోర్టబులిటినీ ఇక నుంచి వినియోగదారులకు అందిస్తాం
- జియో వినియోగదారులకు ఇతర నెట్ వర్క్‌లు సహకరించట్లేదు
- జియోకు వచ్చే 9వేల కోట్ల కాల్స్‌ను ఇతర ఆపరేటర్లు బ్లాక్ చేశారు
- ఫేస్‌బుక్, స్కైప్, వాట్సాప్ కంటే జియో వృద్ధి వేగంగా ఉంది
- ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉచిత ఫోన్ కాల్స్ సేవలు అందిస్తాం
- 2017 మార్చి 31 వరకు జియో సేవలు ఉచితం
- డిసెంబర్ 31వ తేదీ నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సిమ్ సౌకర్యం
- మమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
- 50 మిలియన్ల వినియోగదారులను జియో అధిగమించింది
- జియో నెట్ వర్క్‌కు ఇతర నెట్ వర్క్‌లు సహకరించడం లేదు
- అత్యంత వేగంగా సాంకేతికను అందించే సంస్థ జియో
- సలహాలు, సూచనలు స్వీకరించేందుకే లాంచింగ్ ఆఫర్ ఇచ్చాం
- ఫేస్‌బుక్ కంటే జియో వేగంగా వృద్ధి చెందింది
- జియోలో 5 కోట్ల మంది కస్టమర్లు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mukesh Ambani addresses stakeholders via live broadcast.
Please Wait while comments are loading...