మహా కుంభమేళాకు ముకేశ్ అంబానీ ఫ్యామిలీ..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా ప్రసిద్ది గాంచింది మహా కుంభమేళా వేడుక. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు రోజురోజుకు వస్తున్న భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ముఖేశ్ అంబానీ తో పాటు ఆయన తల్లి కోకిలాబెన్ అంబానీ, భార్య, పిల్లలు ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు హాజరయ్యారు. మరోవైపు మాఘ పూర్ణిమ కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలివస్తున్నారు.
ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన వారు, అక్కడి నుంచి కారులో ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. కుటుంబమంతా కలిసి పడవలో ప్రయాణించి త్రివేణి సంగమానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇప్పటికే కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు పుణ్యస్నానాలు ఆచరించారు. పలువురు సినీ ప్రముఖులు సైతం పుణ్య స్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమంలో ఇప్పటి వరకు 44 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.

నో వెహికల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్
పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం అయోధ్య, కాశీలోని దైవ దర్శనాల కోసం వెళుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక భక్తుల తాకిడితో 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. 50 కి.మీ మేర దూరం వెళ్లడానికే దాదాపు 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా మార్చనున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications