వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముకేష్ అంబానీ, ఆయన ఫ్యామిలీ లండన్ షిప్ట్: ఆ వార్తలపై రిలయన్స్ సంస్థ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

ముంబై: భారత కుబేరుడు, రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబంపై గత కొద్ది రోజులుగా వస్తున్న పలు ఊహాగానాలకు ఆ సంస్థ తెరదించింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్‌ 11వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, గత కొద్ది రోజులుగా ముకేష్ అంబానీ కుటుంబంపై ఓ వార్త ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.

ముకేష్ అంబానీ లండన్ షిఫ్ట్ అవుతున్నారంటూ..

ముకేష్ అంబానీ లండన్ షిఫ్ట్ అవుతున్నారంటూ..

ముకేష్ అంబానీ కుటుంబం కొన్ని రోజుల్లో ముంబై నుంచి పూర్తిగా లండన్‌ షిప్ట్‌ కానుందనేది సదరు వార్త సారాంశం. ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. ముకేశ్‌ అంబానీ లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారని, త్వరలోనే ఆ కుటంబం లండన్‌లో సెటిల్‌ కానున్నారని వెల్లడించింది. ఇక ఇంటి నిర్మాణం గురించి కూడా అనేక విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.

స్పందించిన రిలయన్స్ సంస్థ..

స్పందించిన రిలయన్స్ సంస్థ..

అయితే, కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా.. అటు ముకేశ్‌ అంబానీ నుంచి గానీ వారి సంస్థల నుంచి గానీ ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. దీంతో ఈ వార్తలు నిజమనే వాదనలకు కూడా బలం చేకూరుంది. దీంతో ఈ వార్తలకు ఎంతకీ ఫుల్‌స్టాప్‌ పడకపోవడంతో రిలయన్స్‌ తాజాగా స్పష్టమైన ప్రకటన చేసింది. ముకేశ్‌ అంబానీ లండన్‌కు వెళ్లనున్నారనే వార్తలపై మీడియాకు అధికారిక స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

లండన్‌కే కాదు.. అంబానీ ఎక్కడికీ వెళ్లడం లేదన్న రిలయన్స్

అంబానీ కుటుంబం లండన్‌కు షిప్ట్‌ కానున్నట్లు గతకొన్ని రోజుల క్రితం ఓ వార్తాపత్రికలో నిరాధారనమైన వార్త ప్రచురితమైంది. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ముకేష్ అంబానీ కుటుంబం ముంబైలోనే ఉంటున్నారని స్పష్టం చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఈ వార్తపై స్పష్టతనిచ్చేందుకు ఈ మీడియా స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. అంబానీ కుటుంబం లండన్‌కే కాదు ప్రపంచంలో మరే చోటుకు వెళ్లడం లేదు.

Recommended Video

Mukesh Ambani Closer To $100 Billion ఆయిల్ టు కెమికల్స్, టెలికం టు Digital || Oneindia Telugu
లండన్ భవనం కొనుగోలుపై రిలయన్స్ క్లారిటీ

లండన్ భవనం కొనుగోలుపై రిలయన్స్ క్లారిటీ

ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీ లండన్‌లోని స్టోక్‌ పార్క్ ఎస్టేట్‌ను ఇటీవల కొనుగోలు చేసిన వార్త నిజమే. అయితే ఈ ఎస్టేట్‌ను ప్రీమియర్‌ గోల్ఫింగ్‌ క్లబ్‌తో పాటు క్రీడా రిసార్ట్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే కొనుగోలు చేశామని స్పష్టతనిచ్చింది. లండన్‌లో ఈ ఎస్టేట్‌ కొనుగోలుతో భారత్‌కు మాత్రమే ప్రసిద్ధమైన ఆతిథ్య రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయాలనే లక్ష్యంతోనే ఎస్టేట్‌ను కొనుగోలు చేసినట్లు రిలయన్స్‌ గ్రూప్‌ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు వస్తున్న వార్తలపై అందరికీ పూర్తిగా స్పష్టత వచ్చినట్లయింది.

English summary
Mukesh Ambani & Family Have No Plans Of Moving To London: Reliance Clarifies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X