ఇక ఉచితం కాదు: జియో వినియోగదారులకు షాకింగ్ న్యూస్!

జియో వినియోగదారులకు చేదు వార్త! మార్చి 31వ తేదీ నుంచి ఇక ఉచితం కాదని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన మంగళవారం నాడు జియో విషయమై మాట్లాడారు.

ముంబై: జియో వినియోగదారులకు షాకింగ్ వార్త! మార్చి 31వ తేదీ నుంచి ఇక ఉచితం కాదని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన మంగళవారం నాడు జియో విషయమై మాట్లాడారు.

వచ్చే నెలల్లో ప్రస్తుతం ఉన్న జియో డేటాను రెట్టింపు చేస్తామని చెప్పారు. టెలికాం కంపెనీతో సమానంగా చార్జీలు వేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇరవై శాతం అ్యధికంగా డేటాను అందిస్తామన్నారు.

ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్ ప్లాన్స్ ప్రారంభిస్తామని చెప్పారు. దానిలో అన్ని వాయిస్ కాల్స్ ఉచితం, నో రోమింగ్ ఛార్జెస్, నో హిడెన్ చార్జెస్ అని అంబాని ప్రకటించారు. అన్నింటికి అదే టారిఫ్ అన్నారు.

2017 వరకు అన్ని గ్రామాలకు జియో కవర్ చేస్తుందన్నారు. నెలకు 100 కోట్ల జీబీ డేటాను వినియోగదారులు వాడుతున్నారని అంబానీ చెప్పారు. అంటే రోజుకు 3.3 కోట్ల జీబీ వాడుతున్నారన్నారు.

దేశంలోనే అతిపెద్ద డేటా కన్స్యూమర్‌గా జియో ఉందని ముఖేష్ అంబానీ వెల్లడించారు. డేటా వాడకంలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్‌గా ఉందని తెలిపారు.

జియో రాకముందు మొబైల్ డేటా వాడకంలో భారత్ 150వ స్థానంలో ఉందన్నారు. కేవలం 170 రోజుల్లో పది కోట్ల మంది వినియోగదారులకు చేరుకున్నామన్నారు. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. 2019 నాటికి 99 శాతం మందికి జియో ఉంటుందని చెప్పారు.

ఇదో విప్లవం

ఇదో విప్లవం

జియో ప్రారంభించిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లు చేరడం సంతోషంగా ఉందని ముఖేష్‌ అంబానీ అన్నారు. గత 100 రోజుల్లో సెకనుకు ఏడుగురు కస్టమర్ల చొప్పున జియోలో చేరారని టెలికాం రంగంలోనే ఇదో విప్లవమని తెలిపారు.

ఉచిత కాల్స్ కొనసాగింపు

ఉచిత కాల్స్ కొనసాగింపు

ఏప్రిల్‌ 1 నుంచి జియో టారిఫ్‌ అమలు చేయనున్నట్లు ముఖేశ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్‌ సేవలు కొనసాగుతాయన్నారు. ఎలాంటి రోమింగ్‌ ఛార్జీలు, బ్లాక్‌ అవుట్‌ డేస్‌ ఉండవన్నారు. టారిఫ్‌ అమలు పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. అందుబాటు ధరల్లో అత్యుత్తమ సేవలు అందిస్తామన్నారు.

రూ.99 జియో ప్రైమ్ పేరుతో..

రూ.99 జియో ప్రైమ్ పేరుతో..

మొదటిగా చేరిన 10 కోట్ల మంది జియో వినియోగదారులే జియో బ్రాండ్‌ ప్రచారకర్తలన్నారు. రానున్న రోజుల్లో జియో వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయని అంబానీ ప్రకటించారు. వినియోగదారుల కోసం ఏడాదికి రూ.99తో జియో ప్రైమ్‌ పేరుతో ప్రత్యేక ప్లాన్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

5.5 కోట్ల నిడివి గల వీడియోలు..

5.5 కోట్ల నిడివి గల వీడియోలు..

జియో నెట్‌వర్క్‌లో రోజుకు 5.5కోట్ల నిడివి గల వీడియోలను చూస్తున్నారని ముఖేష్‌ అంబానీ చెప్పారు. భవిష్యత్తులో జియో సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆరేళ్లుగా జియో 4జీ సేవలు ఏర్పాటు చేస్తూ వచ్చామని, దేశంలో ఇతర నెట్‌వర్క్‌ సంస్థల కంటే రెట్టింపు సంఖ్యలో 4జీ టవర్లు జియోకు ఉన్నాయన్నారు.

మనమే ముందు

మనమే ముందు

జియో సేవలను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజిటల్‌ రంగంలో భారత్‌ దూసుకుపోతోందని అంబానీ చెప్పారు. డేటా వినియోగంలో భారతీయులే ముందు వరుసలో ఉన్నారన్నారు.

జియో ప్రైమ్ మెంబర్ షిప్‌తో..

జియో ప్రైమ్ మెంబర్ షిప్‌తో..

రూ.99 రుసుముతో జియో ప్రధాన సభ్యత్వం (ప్రైమ్ మెంబర్ షిప్) కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పిన అంబానీ.. దీనిని మార్చి 1న లాంచ్ చేస్తామని చెప్పారు. మార్చి 31 వరకు ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చునని చెప్పారు. అన్ లిమిటెడ్ సేవలు అందిస్తామన్నారు. జియో ప్రధాన సభ్యులుగా జాయిన్ అయ్యే వారు రోజుకు కేవలం రూ.10.. నెలకు రూ.303 పరిచయ ధరతో అన్ని సేవలను పొందవచ్చునని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+