జియో 'ఫ్రీ' ఫర్ ఆల్: రిలయన్స్ దెబ్బకు ఐడియా, ఎయిర్‌టెల్ విలవిల
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీ.. జియో వినియోగదారులకు ఉచిత వాయిస్ కాలింగ్, రూ.50కే 1జీబీ డేటాతో ఆఫర్లు ప్రకటించడంతో ఇతర టెలికాం నెట్‌వర్క్‌ల షేర్లపై ప్రభావం పడింది.
రిలయన్స్ జియో దెబ్బకు గురువారం ఐడియా, ఎయిర్ టెల్ వంటి కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. ఐడియా సెల్యులర్ షేర్లు ఏకంగా 9 శాతం పడిపోయాయి. షేరు విలువ రూ.85తో బీఎస్‌ఈలో 52వారాల కనిష్ఠానికి పడిపోయింది. ఎయిర్ టెల్ షేర్లు కూడా 8.99శాతం పడిపోయాయి. షేరు విలువ రూ.302కు చేరింది.

ముకేశ్ అంబానీ గురువారం నాడు వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో వినియోగదారులకు 'ఫ్రీ వెల్‌కం ఆఫర్' ప్రకటించారు. సెప్టెంబరు 5 నుంచి డిసెంబరు 31వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఈ నాలుగు నెలలు అన్ని సర్వీసులు ఉచితం. అనంతరం దాదాపు పది టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications