యూపీలో మరో గ్యాంగ్‌స్టర్‌: బీజేపీ ఎమ్మెల్యే హత్యకేసులో

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌కు జైలు శిక్ష పడింది. 10 సంవత్సరాల కారాగారశిక్షను విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీకి చెందిన శాసన సభ్యుడు హత్యకేసులో విచారణను ఎదుర్కొంటూ వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్- టర్న్డ్ పొలిటీషియన్‌ను దోషిగా నిర్ధారించింది న్యాయస్థానం. జైలుశిక్షతో పాటు అయిదు లక్షల రూపాయల జరిమానాను విధించింది.

ఆ గ్యాంగ్‌స్టర్.. ముఖ్తార్ అన్సారి. అయిదుసార్లు శాసన సభకు ఎన్నికైన నాయకుడు కూడా. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా మవు ఆయన సొంత నియోజకవర్గం. ఇక్కడి నుంచి అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2017లో యూపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ బహుజన్ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందారు. ప్రస్తుతం కిడ్నాప్, హత్యారోపణలను ఎదుర్కొంటోన్నారాయన.

Mukhtar Ansari

ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. విచారణను ఎదుర్కొంటోన్నారు. ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఆయనపై నమోదైన కేసులపై ఇవ్వాళ విచారణను ముగించింది. తుది తీర్పును వినిపించింది. ముఖ్తార్ అన్సారికి 10 సంవత్సరాల జైలు శిక్ష, అయిదు లక్షల రూపాయల జరిమానాను విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని మహమ్మదాబాద్ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు కృష్ణానంద రాయ్‌ను హత్య చేసిన ఆరోపణలు ముక్తార్ అన్సారీ మీద ఉన్నాయి.

2005 నవంబర్ 29వ తేదీన తన స్వగ్రామంలో ఏర్పాటైన ఓ ఫంక్షన్‌కు హాజరైన కృష్ణానంద రాయ్‌ను కొందరు కాల్చి చంపారు. ఈ ఘటనలో మొత్తం ఏడుమంది మరణించారు. అప్పట్లో పెను సంచలనం సృష్టించిందీ హత్యోదంతం. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, కల్యాణ్ సింగ్ వంటి హేమాహేమీలు కృష్ణానంద రాయ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్ చేశారు.

ఈ కేసులో ముఖ్తార్ అన్సారీని ప్రధాన నిందితుడిగా గుర్తించారు పోలీసులు. ఆయనే సుపారీ ఇచ్చి చంపించారని తేల్చారు. ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఘాజీపూర్ జిల్లా ఎంపీ/ఎమ్మెల్యే న్యాయస్థానం తాజాగా తన తీర్పును వినిపించింది. ఆయనకు పది సంవత్సరాల కారాగారశిక్ష, అయిదు లక్షల రూపాయల జరిమానాను విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+