తీవ్ర జ్వరం: ఆసుపత్రిలో చేరిన ఎస్పీ అధినేత
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ (75) తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం తీవ్ర అస్వస్ధతకు గురైన ములాయం గుర్గావ్‌లోని మెడిసిటీ మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి.

వైద్య పరీక్షల అనంతరం మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని ములాయంకు వైద్యులు సూచించినట్టు తెలిపాయి. ములాయం కోసం ఆసుపత్రిలో ప్రత్యేకించి ఓ ప్రైవేట్ రూమ్‌ను కేటాయించారు. ఆల్ట్రాసౌండ్ సిటీ స్కానింగ్ తదితర పరీక్షలను పూర్తి చేసినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏడాది మార్చిలో కూడా ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఇదే ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. కాగా సాధారణ పరీక్షల కోసమే ములాయం ఆస్పత్రికి వెళ్లినట్టు సమాజ్ వాదీ పార్టీ వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications