అఖిలేష్.. ఇక చాలు దిగిపో: ములాయం, తండ్రీ కొడుకుల నడుమ మళ్లీ మొదలైన రగడ

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆగ్రా : ఉత్తరప్రదేశ్ లో తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ రగడ మొదలైంది. తన కొడుకు అఖిలేష్ యాదవ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోరారు.

పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలను అఖిలేష్ నెరవేర్చలేకపోయారని ములాయం విమర్శించారు. పార్టీ అధ్యక్ష పదవిని తీసుకునేటప్పుడు మూడు నెలల తర్వాత మళ్లీ తనకు తిరిగి అప్పగిస్తానని అఖిలేష్ చెప్పాడని ఆయన ఆగ్రాలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కానీ ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశాడని మండిపడ్డారు.

mulayam

తనకు పదవుల మీద ఆశ లేదని, అయితే అఖిలేష్ తన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదో జాతీయ మీడియా అతడినే అడగాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏమిటని అడిగిన ప్రశ్నపై మాత్రం వ్యాఖ్యానించేందుకు ములాయం నిరాకరించారు.

వాస్తవానికి ములాయం జాతీయాధ్యక్షుడిగా.. ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఆ విషయం తనకు పెద్దగా తెలియదని ములాయం అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Samajwadi Party founder Mulayam Singh Yadav today asked his son Akhilesh Yadav to step down as the party president. Mulayam Singh Yadav criticised the former Uttar Pradesh Chief Minister Akhilesh Yadav for failing to keep his promise as SP president.Mulayam Singh said that Akhilesh has not kept his promise of returning the party presidency in three months after the election. Speaking to India Today in Agra today, Mulayam Singh said, "Akhilesh had taken the party presidency in his hands after assuring him that he would return it me in three months. But, now he is retracting from his promise."
Please Wait while comments are loading...