ఆసక్తికరం: ములాయం, శివపాల్ కొత్త రాజకీయ ఫ్రంట్, 30న ప్రారంభం, ఇక అఖిలేష్ ఏం చేస్తారో?
ములాయం సింగ్ యాదవ్ తన సోదదరుడు శివపాల్ యాదవ్‌తో కలిసి 'కొత్త రాజకీయ ఫ్రంట్' ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 30న అధికారికంగా ఆయన ఓ ప్రకటన చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
లక్నో: ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో తలెత్తిన ముసలం తాజాగా కొత్త మలుపు తిరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పొత్తుల విషయంలో తండ్రీకొడుకులైన ములాయం, అఖిలేష్ మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.
ఈ వివాదం చివరకు పార్టీ అధ్యక్ష పదవిని అఖిలేష్ దక్కించుకోవడం వరకూ వెళ్లింది. అప్పట్నించి అసంతృప్తితో రగులుతున్న ములాయం తాజాగా తన దారి తాను చూసుకోనున్నారు.

మొదట్నించీ తనకు వెన్నుదన్నుగా నిలిచిన తన సోదదరుడు శివపాల్ యాదవ్‌తో కలిసి 'కొత్త రాజకీయ ఫ్రంట్' ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 30న అధికారికంగా ఆయన ఓ ప్రకటన చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై అఖిలేష్ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications