రూ. కోటి డిమాండ్: చిన్నారిని కిడ్నాప్ చేసి ముక్కలుగా నరికిన మైనర్లు
మహారాష్ట్రలో దారుణం జరిగింది. డబ్బు కోసం16 ఏళ్ల మైనర్ బాలురు ఇద్దరు తీవ్ర ఘాతుకానికి ఒడిగట్టారు.
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. డబ్బు కోసం16 ఏళ్ల మైనర్ బాలురు ఇద్దరు తీవ్ర ఘాతుకానికి ఒడిగట్టారు. మూడున్నరేళ్ల పాపను అపహరించి.. దారుణంగా హత్య చేశారు. నాగ్‌పడ ప్రాంతంలోని కాజిపురాలో బాలిక మృతదేహం దొరకడంతో శనివారం రాత్రి ఈ పాశవిక ఘటన వెలుగుచూసింది.
నిందితుల్లో ఒకరు బాలిక ఇంటిపక్కన నివసించేవాడే కావడం గమనార్హం. ఓ స్నేహితుడితో కలిసి డిసెంబర్ 5న అతడు మూడేళ్లపాటు పాపను అపహరించాడు. అనంతరం పాపను విడిపించుకునేందుకు రూ.కోటి ఇవ్వాలంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. అంతమొత్తం ఇచ్చుకోలేమని ప్రాధేయపడిన పాప తండ్రి.. రూ.28 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు.

థానేలోని కల్వా ప్రాంతానికి డబ్బు తీసుకురావాలని దుండగులు సూచించారు. కానీ, సొమ్ము తీసుకోవడానికి వారు మాత్రం అక్కడికి రాలేదు. అంతకుముందే, పాప తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. వారి ఇంటి పక్కన నివసించే బాలుడు, అతడి స్నేహితుడిపై నిఘాఉంచారు.
శనివారం వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. చిన్నారిని అపహరించింది తామేనని ఒప్పుకున్నారు. మత్తుమందు సాయంతో అపహరించి తీసుకెళ్లామని చెప్పారు. అదే రోజు తాము అడిగిన సొమ్ము ఇవ్వలేదన్న కోపంతో ఆ చిన్నారిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసినట్లు నిందితులు అంగీకరించారు. నిందితులిద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications