ముంబై: ఎయిర్ పోర్టులో బుల్లెట్లతో దొరికిన మహిళ... ప్రశ్నించిన పోలీసులు

ముంబై: ఇటీవల విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఫోన్లు, మేసేజ్‌లు వస్తున్న నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో అధికారులు భద్రతపై మరింత దృష్టి సారించారు. దీనిలో భాగంగా ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

 Mumbai: 33-Year-Old Housewife Caught at Airport With 4 Live Bullets

మంగళవారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో 33 ఏళ్ల మహిళ బ్యాగులో నాలుగు బుల్లెట్లు లభ్యమయ్యాయి. వెంటనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకుంది.

ఆ మహిళ పేరు శ్వేతాలి అడ్నాయక్. ముంబై గృహిణి. టెర్మినల్ 2 వద్ద లెవెల్ 4 మెయిన్ గేట్ వద్ద అధికారులు ఆమెను ఆపారు. తన ముగ్గురు బంధువులతో ఆమె బుధవారం ఉదయం 1.30 హాంకాంగ్ వెళ్లాల్సి ఉంది. దీంతో ఆమె బ్యాగులో బుల్లెట్లు లభించండతో ఆమె ప్రయాణాన్ని మరుసటి రోజుకి వాయిదా వేశారు.

1959 ఆయుధాల చట్టం కింద శ్వేతాలి అడ్నాయక్‌పై కేసు నమోదు చేశారు. శ్వేతాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుల్లెట్ల విషయమై ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+