వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ప్రేమించిన యువతిని రైలు కింద తోసేశాడు, చివరకు కటకటాల వెనక్కి

|
Google Oneindia TeluguNews

ముంబై: తనతో పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ యువతిని రైలు కిందకు నెట్టేందుకు ప్రయత్నించాడో యువకుడు. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఖార్ రైల్వే స్టేషన్‌లో ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. వడాలాకు చెందిన సుమేధ్ జాదవ్, బాధిత యువతి గతంలో ఒకే కంపెనీలో పనిచేశారు. ఈ సమయంలోనే ప్రేమిస్తున్నానంటూ యువీతి వెంటపడ్డాడు నిందితుడు జాదవ్. అయితే, జాదవ్ మద్యానికి బానిసయ్యాడని తెలిసి అతడ్ని దూరం పెట్టింది యువతి.

Mumbai: A man pushes woman under running train at Khar railway station

ఇక అప్పట్నుంచి యువతిని వేధించడం మొదలుపెట్టాడు జాదవ్. అంధేరిలో యువతి రైలు ఎక్కగా.. జాదవ్ ఆమెను వెంబడించాడు. యువతి తల్లికి ఫోన్ చేయడంతో ఆమె ఖార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధించసాగాడు. అయితే, ఆమె అందుకు నిరాకరించింది.

ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సుమేధ్ జాదవ్.. ఆ యువతిని బలవంతంగా లాక్కెళ్లి.. రైల్వే స్టేషన్‌లోకి వస్తున్న లోకల్ రైలు కింద పడేసేందుకు ప్రయత్నించాడు. యువతి, ఆమె తల్లి తీవ్రంగా ప్రతిఘటించడం పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, యువతికి తలకు తీవ్ర గాయమైంది. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడ్నుంచి నిందితుడు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 12 గంటల్లోపే నిందితుడు సుమేధ్ జాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాధిత యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

English summary
A man allegedly pushed a woman under a running train at the Khar railway station after she stopped responding to his advances. The accused, however, did not succeed and fled from the spot. The man was arrested within 12 hours of the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X