ముంబై బాంబు పేలుళ్లు: 12 మందికి శిక్ష ఖరారు

హైదరాబాద్: 2006లో ముంబైలోని ప్రయాణికుల రైళ్లలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో మోకా ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో దోషులకు శిక్షను ఖరారు చేసింది. ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘంగా సాగిన విచారణలో శుక్రవారం తుదితీర్పు వెలువడింది. గత ఏడాది ఆగస్టులో విచారణ ముగిసినప్పటికీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

12 మందిని దోషులుగా నిర్ధారించిన మోకా కోర్టు 5500 పేజీల సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు వెలువరించామని తెలిపింది. ప్రాసిక్యూషన్ తరపున 192 మందిని విచారించారు. 2006 జులై 11న ముంబై సబర్బన్ రైళ్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్ర వాదులు వరుస పేలుళ్లు జరిపారు. ఈ బాంబు పేలుళ్ల ఘటనలో 189 మంది చనిపోగా, 800 మంది వరకు గాయపడ్డారు.

Mumbai blasts 2006: India court finds 12 men guilty

ఖార్ రోడ్, బాంద్రా, మాతుంగా, మాహిమ్ జంక్షన్, జోగేశ్వరి, మీరా రోడ్, భయాందర్, బోరీవాలిల్లో 11 నిమిషాల తేడాలో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు సంబంధించి ముంబై యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్‌ 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి మరో పది మంది పరారీలో ఉన్నారు. మోకా కోర్టు తీర్పు నేపథ్యంలో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+