• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తస్మాత్ జాగ్రత్త: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత వ్యక్తి మృతి... వైద్యం ఎందుకు వికటించింది..?

|

ముంబై: ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ఓ పారిశ్రామికవేత్త హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్న రెండురోజులకే మృత్యువాత పడ్డాడు. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకుంటేనే ఎలా మృతి చెందాడు...? అంతకు ముందు దారితీసిన పరిణామాలేంటి..? వైద్య నిపుణులు ఏమని చెబుతున్నారు..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

బెంగాల్‌లో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాకిచ్చిన మమతా ...టీఎంసీ అభ్యర్థుల జాబితా ఇదే..!

శ్రవణ్ ఎలా మృతి చెందాడు..?

శ్రవణ్ ఎలా మృతి చెందాడు..?

మార్చి 8న ముంబైకి చెందిన శ్రవణ్ కుమార్ చౌదరి అనే 43 ఏళ్ల పారిశ్రామికవేత్త స్థానిక హీరానందని ఆస్పత్రికి వెళ్లాడు. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులకు తెలిపాడు. అంతేకాదు తన ముఖంపై వాపు గొంతు కింద వాపు స్పష్టంగా కనిపించిందని వైద్యులు తెలిపారు. ఈ వాపులను చూసిన వైద్యులు ప్రమాదకరమైన అనఫిలాక్సిస్ వ్యాధిగా గుర్తించారు. ఇది అలర్జీ వల్ల వస్తుందని తెలిపారు. ఇక వరుసగా శరీరంలో మార్పులు చోటుచేసుకుంటుండటంతో డ్యూటీ డాక్టర్ వెంటనే గుండెనిపుణుడిని కూడా పిలిపించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే శనివారం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు శ్రవణ్ అనే ఈ బిజినెస్ మ్యాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ అలర్జీ రావడానికి కారణం ఆయన చేయించుకున్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషనే అని వైద్యులు ధృవీకరించారు.

ఒకే సిటింగ్‌లో ఎన్ని వెంట్రుకలు రీప్లేస్ చేయొచ్చు

ఒకే సిటింగ్‌లో ఎన్ని వెంట్రుకలు రీప్లేస్ చేయొచ్చు

ఇక హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం శ్రవణ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ వికాస్ హల్వాయ్ క్లినిక్‌కు గత గురువారం వెళ్లాడు. ఒకే సిట్టింగ్‌లో 9,250 వెంట్రుకలు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని భావించినట్లు డాక్టర్ వికాస్ పోలీసులకు తెలిపారు. ఇక 3700 వెంట్రుకలు ట్రాన్స్‌ప్లాంట్ అవ్వగానే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినట్లు తాను గమనించినట్లు డాక్టర్ చెప్పారు. సాధారణంగా ఆరుగంటల పాటు 3000 వెంట్రుకలు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం 15 గంటల పాటు 9,250 వెంట్రుకలు ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్రాన్స్‌ప్లాంట్‌ కంటే ముందు శ్రవణ్ అన్ని టెస్టులు చేయించుకున్నాడని డాక్టర్ వికాస్ తెలిపారు.

పెయిన్ కిల్లర్స్ యాంటి బయోటిక్ మాత్రలే ప్రాణం తీశాయా..?

పెయిన్ కిల్లర్స్ యాంటి బయోటిక్ మాత్రలే ప్రాణం తీశాయా..?

ఇక గురువారం సాయంత్రం ట్రాన్స్‌ప్లాంట్ మొదలు పెట్టారు. మరుసటి రోజు తెల్లవారు జామున 2:30 గంటలకు గొంతు నొప్పిగా ఉందని తనతో శ్రవణ్ చెప్పినట్లు డాక్టర్ వికాస్ వెల్లడించారు. దీంతో నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ యాంటీ బయోటిక్ మాత్రలు ఇచ్చినట్లు వెల్లడించాడు. అంతలోనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వెంటనే శ్రవణ్‌ను గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించారు. ఇక అక్కడి నుంచి మరో హాస్పిటల్‌కు శ్రవణ్‌ను తరలించారని పోలీసులు తెలిపారు. అక్కడే శ్రవణ్ మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు.

వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?

వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?

ఇక వైద్య నిపుణులు మాత్రం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఒక పేషెంట్‌ను సుదీర్ఘంగా అనెస్తీషియా ఇచ్చి ఉంచరాదని చెబుతున్నారు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సందర్భంగా 3000 వెంట్రుకలను ఒకే సిట్టింగ్‌లో 6 గంటలలోపు చేయాలని లేదంటే ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక నొప్పి రావడంతో పెయిన్ కిల్లర్స్ యాంటిబయోటిక్ మాత్రలు పేషెంట్‌ శరీరానికి సహించకపోయి ఉండొచ్చని అందుకే తీవ్రమైన అలర్జీ వచ్చి తన మృతికి దారితీసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని అనుభవం ఉన్న వైద్యులతోనే చేయించుకోవాలని సూచిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A dermatologist was called in for a statement by the police in Mumbai, Maharashtra when a businessman died after undergoing hair transplant at the dermatologist's clinic.The businessman, who was in his early 40s, died on Saturday (March 9).According to a report, the businessman was rushed to a hospital on Friday (March 8) with breathlessness and swelling on the face and throat. The report said that according to the preliminary observation, the businessman had symptoms of anaphylaxis, a severe allergic reaction, and suffered multi-organ failure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more