ఖరీదైన సిటీ: భారత్‌లో ముంబై టాప్, వరల్డ్‌లో 74
ముంబై: ఆర్థిక రాజధాని ముంబై దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా మరోసారి నిలిచింది. డల్లాస్, ఫ్రాంక్‌ఫర్ట్, వాంకోవర్‌లను వెనక్కినెట్టి ముంబై ముందుస్థానానికి చేరుకుందని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా అంగోలా రాజధాని లువాండా ఉందని 2015 సంవత్సరానికిగాను కాస్ట్ ఆఫ్ లీవింగ్ సర్వే పేరుతో నిర్వహించిన సర్వే తెలిపింది. ఇండియాలో అత్యంత ఖరీదైన నగరమైన ముంబై ఈ జాబితాలో 74వ స్థానంలో నిలిచింది.
దేశ ఆర్థికరంగం వృద్ధి బాట పట్టడం, ద్రవ్యోల్బణం, సర్వీసెస్, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నిలకడగా నమోదుకావడం తదితర అంశాలు ముంబైని ఖరీదైన నగరంగా నిలిపేందుకు సహాయపడ్డాయని పేర్కొంది.

ఈ జాబితాలో డల్లాస్‌కు 77వ స్థానం లభించగా, మునిచికి 87వ, లక్సెంబర్గ్ 94వ, ఫ్రాంక్‌ఫర్ట్ 98వ, వాంకోవర్‌లు 119వ స్థానంలో ఉన్నాయి. న్యూఢిల్లీ 132వ ర్యాంక్ దక్కించుకోగా, చెన్నైకు 157, బెంగళూరు 183, కోల్‌కతా 193 స్థానంలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 207 నగరాల్లో ఉన్న 200 ఉత్పత్తుల ధరల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయించింది.
ప్రధానంగా గృహాలు, ఆహారం, బట్టలు, గృహానికి సంబంధించిన వస్తువులు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెచ్చించే ఖర్చుల ఆధారంగా ఖరీదైన నగరాలకు ర్యాంకులు ఇచ్చాయి. టాప్-10లో ఆసియా దేశాల్లోని నగరాల హవా కొనసాగింది. కాంగ్(2వ), జూరిచ్(3వ), సింగపూర్(4వ), జెనీవా(5వ) స్థానంలో నిలిచినట్లు సర్వే పేర్కొంది.












Click it and Unblock the Notifications