వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవనీత్ కౌర్ ఆరోపణలు తోసిపుచ్చిన ముంబై సీపీ-టీ తాగుతున్న వీడియోల రిలీజ్

|
Google Oneindia TeluguNews

ముంబైలో అధికార శివసేన వర్సెస్ ఎంపీ నవనీత్ కౌర్ గా సాగుతున్న వివాదం తాజాగా మరో మలుపు తిరిగింది. సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానంటూ ప్రకటించిన సంచలనం రేపిన నవనీత్ కౌర్ పై పోలీసులు మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ కేసు పెట్టి జైలుకు పంపారు. ఈ క్రమంలో ముంబై పోలీసు కస్టడీలో తనను వేధించారంటూ నవనీత్ కౌర్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.

ముంబై పోలీసు కస్టడీలో తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారంటూ ఎంపీ నవనీత్ కౌర్ చేసిన ఆరోపణలపై పోలీసులు మండిపడ్డారు. కస్టడీలో నవనీత్ కౌర్ తో పాటు ఆమె భర్త రవి రాణాకు టీ ఇచ్చిన మర్యాదలు చేస్తున్న వీడియోలను విడుదల చేశారు. దీంతో నవనీత్ కౌర్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా కస్టడీలో దారుణంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే స్పందిస్తూ, ఎంపీ, ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణా ఖర్ పోలీస్ స్టేషన్‌లో టీ తాగుతున్న వీడియోను షేర్ చేశారు. మేము ఇంకేమైనా చెప్పాలా అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేశారు.

Mumbai cp denied navneet ranas ill treatment allegations, shares video of having tea

ఐపీసీ సెక్షన్ 353 కింద నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాను కస్టడీలోకి తీసుకున్నారు. ఇది ప్రభుత్వోద్యోగి తన విధి నిర్వహణలో అతనిపై దాడి చేయడం లేదా క్రిమినల్ బలాన్ని ప్రయోగించడం వంటి ఆరోపణలకు సంబంధించింది. ఉద్ధవ్ ఠాక్రే నివాసం వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తానని బెదిరింపులకు పాల్పడినందుకు తనను అరెస్టు చేసిన తర్వాత చిత్రహింసలకు గురిచేశారని నవనీత్ రాణా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తన కులం కారణంగానే తనను వేధించారని ఆరోపించారు.

తన లేఖలో, రానా నేను రాత్రంతా తాగునీటి కోసం పదేపదే డిమాండ్ చేశానని, అయినప్పటికీ, తాగునీరు అందించలేదన్నారు. తనకు షాక్, అపనమ్మకంతో, అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది తాను షెడ్యూల్ కులానికి చెందినదాన్ని కాబట్టి .. గ్లాస్ లో నీళ్లు ఇవ్వబోమన్నారు. ఖర్ పోలీస్ స్టేషన్‌లోని లాక్-అప్‌లో తనకు జరిగిన ట్రీట్ మెంట్ జంతువులతో వ్యవహరించే దానికంటే దారుణంగా ఉందని కౌర్ లోక్ సభ స్పీకర్ కు రాసిన లేఖలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ వీడియో విడుదల చేశారు.

English summary
mumbai police have denied mp navneet rana's allegation on ill treatment to her in police custoday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X