బోనులో పడిన లేడీ డాన్, డ్రగ్స్ కింగ్ పిన్ బేబి
ముంబై: మహారాష్ట్రను కుదిపేసిన డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ లేడీ డాన్ శశికళ రమేష్ పట్నాకర్ అలియాస్ బేబి (52) అనే మహిళను బుధవారం వేకువ జామున ముంబై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని రహస్య ప్రాంతంలో ఆమెను పోలీసులు విచారణ చేస్తున్నారు. బేబి ఇంతకాలం ఎక్కడ ఉందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తూ వచ్చారు.
ముంబై నగరంతో పాటు మహారాష్ట్రలో బేబికి పెద్ద నెట్ వర్క్ ఉంది. డ్రంగ్స్ దందాలో బేబి కింగ్ పిన్. డ్రగ్స్ మాఫియా ముఠా సభ్యులు బేబిని ముద్దుగా మియ్యావ్ మియ్యావ్ (పిల్లి అరిచినట్లు) అని పిలుచుకుంటారు. గత నెల మార్చి 9వ తేదీన బేబి రూ. కోన్ని కోట్ల విలువైన 126 కేజీల డ్రగ్స్ ముంబై తీసుకు వచ్చి సరఫరా చేసింది. .

ఆ సందర్బంలో పోలీసులు ఆమెను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించారు. విషయం గుర్తించిన బేబి అజ్ఞాతంలోకి వెళ్లి పోయింది. సుమారు 150 మంది పోలీసులు బేబి కోసం గాలించారు. అయితే బేబి ఆచూకి మాత్రం చిక్కలేదు.
విసిగిపోయిన పోలీసులు ఆమెను అరెస్టు చెయ్యడానికి సరికొత్త ప్లాన్ వేశారు. ముంబైలోని బేబికి చెందిన రూ. 3 కోట్ల ఆస్తి (ప్రభుత్వ విలువ)ని స్వాధీనం చేసుకుంటున్నామని పోలీసులు ప్రచారం చేశారు. బేబి అనుచరుల చెవిలో ఈ విషయం పడేటట్లు చేశారు.

బేబికి విషయం తెలిసింది. రూ. కోట్ల విలువైన ఏంతో ఆస్తి ఉన్న బేబికి ఈ ఆస్తిపై కొంత సెంటిమెంట్ అని సమాచారం. విషయం తెలుసుకున్న బేబి ఎలాగైన తన ఆస్తిని కాపాడుకోవాలని అనుకుంది. సొంత కార్లు, అద్దె కార్లలో వస్తే ఇబ్బంది అని భావించి ఆమె సామాన్యులు ప్రయాణించే బస్సులో ముంబైకి బయులుదేరింది.
అప్పటికే ఇన్ ఫార్మర్ ల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ముంబై నగర శివార్లలో బస్సును అడ్డగించి బేబిని అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు గిరీష్, బేబి అనుచరులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేబి అరెస్టుతో డ్రగ్స్ మాఫియా ముఠా సభ్యులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్టి పోయారు.












Click it and Unblock the Notifications