• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముంబైకి చెందిన సుష్మితా సింగ్‌దే మిస్ టీన్ వరల్డ్ టైటిల్ -2019

|

దేశం అంతా ఎన్నికల మూడ్‌లో ఉన్న సమయంలో ప్రపంచ వేదికపై భారత్ మరో ఘనత సాధించింది. ముంబైకి చెందిన 18 ఏళ్ల సుష్మితా సింగ్ ఎల్‌సాల్వడార్‌లో జరిగిన మిస్ టీన్ వరల్డ్‌ కిరీటాన్ని కైవసం చేసుకుంది సుష్మితా సింగ్. ఈ కిరీటాన్ని డామినిక్ రిపబ్లిక్‌కు చెందిన అందాల భామ అంజివేట్ టోరిబియో గతేడాది ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ సారి విజేత అయిన సుష్మితా తలపై ఈ కిరీటాన్ని అంజివేట్ టోరిబియో ఉంచారు.

ఇక మిస్ టీన్ వరల్డ్ 2019లో రన్నర్స్ అప్ గా నిలిచాయి పనామా, డామినికన్ రిపబ్లిక్ దేశాలు. వారి ప్రవర్తన, ఇంటెలిజెన్స్, ఫిట్‌నెస్, ఫ్యాషన్, మరియు గ్లామర్ అంశాలను న్యాయమూర్తులు ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని మొత్తం 8 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ సమయంలో అమ్మాయిలంతా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో పబ్లిక్ పరేడ్లు, మేయర్‌ సందర్శన, సైట్ సీఇంగ్, ఫోటోషూట్లు, చారిటబుల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Mumbai girl Sushmita Singh wins Miss Teen World 2019 title

ఇక అందాల పోటీలో విజేతగా నిలిచిన సుష్మితా మాస్ మీడియా విద్యార్థిని. ఆమెకు చిత్రలేఖనం, క్రీడలు అంటే చాలా ఆసక్తి అని చెప్పారు. అంతేకాదు మంచి డిబేట్లలో కూడా ఆమె పాల్గొన్నారు. తను అందంగా లేనని చాలామంది తనతో అన్నారని కానీ ఫ్యాషన్‌ రంగంపై ఉన్న ఇష్టం తనను ఈ పోటీకి సన్నద్ధం అయ్యేలా చేసిందన్నారు సుష్మితా. ఇందుకోసం ఎంతో కష్టపడ్డానని తను పడ్డ కష్టానికి ఫలితం దొరికిందని ఆనందం వ్యక్తం చేశారు సుష్మితా. ప్రతి అమ్మాయి తాను కన్న కలలను నెరవేర్చుకోవాలని ఆ విధంగా తను స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు సుష్మితా చెప్పారు.

Mumbai girl Sushmita Singh wins Miss Teen World 2019 title

ఇక తమ కూతురు కచ్చితంగా మిస్ టీన్ వరల్డ్ పోటీల్లో విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకు ముందునుంచే ఉన్నిందని చెప్పారు సుష్మితా తల్లిదండ్రులు. అయితే కాంపిటీషన్‌లోకి వచ్చేసరికి తన కూతురులానే ఇతరులు కూడా కష్టపడటం తాము చూసినట్లు సుష్మితా తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పుడు తమకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారితో మంచి సంబంధాలు ఏర్పడ్డాయని..ఈ కాంపిటీషన్‌లో ఎవరూ ఓటమిపాలు కాలేదని అందరూ తమ తమ శైలిలో విజేతలే అని సుష్మితా తల్లిదండ్రులు సత్యభామ నవీన్ సింగ్‌లు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An 18-year-old girl, Sushmita Singh, from Mumbai has been crowned the Miss Teen World at a glittering event in El Salvador, USA. Angivete Toribio of Dominican Republic, won the contest last year and crowned Sushmita this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more