వ్యభిచారిణులంటూ భార్య, కూతుళ్ల గురించి.. వాట్సప్ గ్రూప్‌లో పెట్టి...

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబయి : భర్త, తండ్రి అనే పదాలకు కళంకం తెచ్చే వ్యక్తులు కూడా ఉంటారు. ఇది అలాంటి కథే. ఓ భర్త తన భార్య, కుమార్తెను వ్యభిచారిణులుగా పేర్కొంటూ వారి ఫొటోలు, ఫోన్ నంబర్లను ఏకంగా వాట్సాప్ గ్రూప్ లో పెట్టేశాడు.

మహిళను హతమార్చి.. మృతదేహంతో సంభోగం, ఎట్టకేలకు దొరికిన నిందితుడు

ఈ బాగోతం మహారాష్ట్రలోని ముంబయి నగరంలో వెలుగుచూసింది. ముంబయి నగరంలోని విల్లేపార్లే ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యాపారి ఇతర మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

Mumbai man circulates wife’s number on WhatsApp, says she is a prostitute, held

దీంతో అతని భార్య, కూతురు ఆయన ఇంటి నుంచి నాలుగేళ్ల క్రితం బయటకు వెళ్లి పోయారు. తనను వదిలి వెళ్లిపోయారనే కసితో ఆ వ్యాపారి కట్టుకున్న భార్య, కన్నకూతురని కూడా చూడకుండా.. వారిని వ్యభిచారిణులుగా పేర్కొంటూ వారి ఫొటోలు, ఫోన్ నంబర్లను వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడు.

''నమ్మించి లోబరుచుకున్నాడు.. డబ్బులివ్వకపోతే ఫొటోలు నెట్‌లో పెడతానంటున్నాడు..''

కిడ్నాప్ కలకలం: కారులో వచ్చారు.. తండ్రి పక్కనుండగానే కూతుర్ని ఎత్తుకెళ్లారు!

ఇంకేముంది.. ఆ తల్లీకూతుళ్లను ఫోన్ కాల్స్ ముంచెత్తాయి. కొందరు ఫోన్ చేసి వెకిలిగా, అమర్యాదగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ ఘటనపై ఆ తల్లీ కూతుళ్లు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన ఆ వ్యాపారిని అరెస్టు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Vile Parle police arrested a 45-year-old man on Sunday, after his wife complained of harassment. Police said the man created a WhatsApp group, added 19 members to it and then posted his wife and daughter’s contact details and photos, saying they were prostitutes. Police said the accused is a businessman. His 45-year-old wife and children left him four years ago, after they discovered his extramarital affair. The matter came to light after the man’s 23-year-old daughter received a few calls from people who used obscene language and said her father had told them she was a sex worker. The man’s wife said he had sent her obscene and abusive text messages a few days ago. On December 2, she approached the police, who registered a case against her husband. He was granted bail for Rs15,000.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి