• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంట్రెస్టింగ్: నా అభిప్రాయం లేకుండా నాకు జన్మనిచ్చారు.. అందుకే పేరెంట్స్ పై కేసు

|

ఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిరిగిన కేసులను ఎన్నో చూశాం. పెళ్లిపై కోర్టులకు వెళ్లడం, విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించడం, పుట్టిన బిడ్డ ఎవరికి చెందుతారో న్యాయం చెప్పాలంటూ కోర్టులకు ఎక్కడం, కుటుంబ కలహాల విషయంలో న్యాయంకోసం కోర్టు మెట్లు ఎక్కడం ఇలా చాలా కేసులను చూశాం. అయితే తొలిసారిగా ఓ కొత్త కేసును వినాల్సిన దౌర్భాగ్యం పట్టింది. ఇంతకీ ఆ కేసు ఏమిటో తెలుసా..?

 తల్లిదండ్రులు దేవుడితో సమానం

తల్లిదండ్రులు దేవుడితో సమానం

తల్లిదండ్రులు దేవుడిచ్చిన వరం అని భావిస్తాం. కొందరకి అదే తల్లిదండ్రులు లేక అనాథలుగా మారుతున్నారు. తమ ఆలనాపాలనా చూసే తల్లిదండ్రులు లేక ఎంతో మంది చిన్నపిల్లలు బతుకుబండిని లాగుతున్నారు. అసలు తల్లి ఎవరో తెలియని చిన్నారుల పరిస్థితి మరీ దారుణం. కొందరు తమ సుఖం కోసం తప్పు చేసి పిల్లలను కని చెత్తకుప్పల్లో పడేస్తున్న ఘటనలను చూస్తున్నాం. తమ పిల్లలను డబ్బుల కోసం అమ్ముకుంటున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. మరి ప్రపంచంలో ఇలా తల్లిదండ్రుల ప్రేమ నోచుకోని వారు కోకొల్లు.

నా అభిప్రాయం లేకుండా నన్ను ఎందుకు కన్నారు: శామ్యూల్

ముంబైకి చెందిన ఓ వ్యక్తి మాత్రం తన అభిప్రాయం తీసుకోకుండానే తన తల్లిదండ్రులు ఈ ప్రంపంచంలోకి తీసుకువచ్చారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాడట. రాఫెల్ శామ్యూల్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులు తనకు చెప్పకుండానే జన్మనిచ్చారంటూ తన ఫేస్‌బుక్‌ పోస్టులో వెల్లడించాడు. ఇదే విషయమై తను కోర్టును ఆశ్రయించనున్నట్లు పేర్కొన్నాడు. శామ్యూల్‌కు మానవజాతిపై నమ్మకం లేదు. పూర్తిగా వ్యతిరేకి. పిల్లలను కనడం వల్ల వారు పెరిగి భూమిని నాశనం చేస్తున్నారని ఆరోపించాడు. అందుకే పిల్లలను కనడాన్ని శామ్యూల్స్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు.

ఒక ప్రాణికి హాని చేసే హక్కు ఎవరికీ లేదు

ఒక ప్రాణికి హాని చేసే హక్కు ఎవరికీ లేదు

అయితే శామ్యూల్ గురించి తెలిశాక అతనికి తన తల్లిదండ్రులు అంటే ఇష్టం లేదని అనుకోవచ్చు. కానీ అది తప్పు. తన పేరెంట్స్ అంటే శామ్యూల్‌కు ఇష్టమే కానీ... పిల్లలను కనడం అనే కాన్సెప్ట్‌ను మాత్రం వ్యతిరేకిస్తున్నాడు. "నాకు నా తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం. కానీ వారి సుఖం సంతోషం కోసం నాకు జన్మనిచ్చారు. నా జీవితం అద్భుతంగా ఉంది. అయితే నా వల్ల మరొకరికి హానీ కలగడం ఇష్టం లేదు." అని చెప్పాడు. అంతేకాదు శామ్యూల్‌కు నిహిలాండ్ పేరుతో ఓ ఫేస్‌బుక్ పేజ్ కూడా ఉంది. అందులో పిల్లలు ఈ ప్రపంచంలో ఎలా ఉండాలనే దానిపై ఆయన ప్రసంగిస్తుంటాడు. పిల్లల సంఖ్య పెరిగే కొద్దీ ఈ భూమిపై నేరాలు పెరుగుతూ ఉంటాయని శామ్యూల్ అభిప్రాయపడ్డాడు.

మొత్తానికి రాఫెల్ శామ్యూల్ తీసుకున్న నిర్ణయం వినేందుకు విడ్డూరంగా ఉన్నప్పటికీ... ఆయన చూడాలనుకుంటున్న ప్రపంచం మరోకటి అని తెలిసినప్పుడు అతని వాదనలో కూడా నిజం ఉందని చెప్పడంలో తప్పులేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This world never ceases to surprise us. A man from Mumbai has decided to sue his own parents because they brought them into the world without taking his 'consent'. The 27-year-old, named Raphael Samuel, is upset that his parents did not take his permission for giving him birth, as per reports and posts on social media site Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more