Girl: ఇంట్లో ఫైటింగ్, నమ్మించి జీవితనం నాశనం చేశాడు. రెండు చోట్ల ఒకే అమ్మాయి గ్యాంగ్ రేప్ !
ముంబాయి/నాగ్ పూర్: ఇంట్లో వదిన, ఆమె మైనర్ మరదలకు నిత్యం చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో వదినతో పెద్దగా గొడవపడిన అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. రైలులో బంధువుల ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అమ్మాయిని కామాంధుడైన ఆటో డ్రైవర్ పరిచయం చేసుకుని తాను ఆశ్రయం ఇస్తానని మాయమాటలు చెప్పాడు. అమ్మాయిని పిలుచుకుని వెళ్లిన ఆటో డ్రైవర్ మరో ముగ్గురితో కలిసి అమ్మాయిని రేప్ గ్యాంగ్ రేప్ శాడు. గ్యాంగ్ రేప్ చేసిన అమ్మాయిని పిలుచుకుని రైల్వేస్టేషన్ దగ్గర వదిలేశాడు. అక్కడ మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. ఒకే అమ్మాయిని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆరు మంది గ్యాంగ్ రేప్ చెయ్యడం ఆ నగరంలో కలకలం రేపింది. ముగ్గురు కామాంధులు పట్టుబడటంతో మరో ముగ్గరు కామాంధులు ఎస్కేప్ అయ్యారు.

వదిన మరదలు ఫైటింగ్
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఎస్పీ వర్గానికి చెందిన ఓ మైనర్ అమ్మాయి నివాసం ఉంటున్నది. ఇంట్లో వదిన, ఆమె మైనర్ మరదలకు నిత్యం చిన్నచిన్న గొడవలు జరుగుతూ అవి పెద్దవి అయ్యాయి. ఇంట్లో వదినతో పెద్దగా గొడవపడిన అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. రైలులో బంధువుల ఇంటికి వెళ్లడానికి డబ్బులు కావాలని ఎవరినైనా అడగాలని ప్రయత్నించింది.

ఆటో డ్రైవర్ ఎంట్రీ
లోహాపూర్ ప్రాంతం నుంచి బంధువుల ఇంటికి రైలులో వెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో ఆ అమ్మాయి అయోమయంలో దిక్కులు చూస్తూ ఉంది. ఆ సమయంలో షాన్ వాజ్ అలియాస్ సనా మోహమ్మద్ రషీద్ (25) అనే కామంధుడు అయోమయంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్నా ఆ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు.

లిక్కర్ తాగి రూమ్ లో ?
తనకు ఉండటానికి ఈ రోజు ఆశ్రయం ఇచ్చి డబ్బులు సహాయం చేస్తే తాను మా బంధువుల ఇంటికి వెళ్లిపోతానని ఆ అమ్మాయి షాన్ వాజ్ కు చెప్పింది. నీకు ఆశ్రయం ఇస్తానని నమ్మించిన షాన్ వాజ్ ఆమెను ఆటోలో పిలుచుకుని వెళ్లాడు. మార్గం మద్యలో వైన్ షాప్ దగ్గర మద్యం తీసుకుని సేవించాడు. తరువాత ఆటోలో ఆ అమ్మాయిని మద్యం తాగాలని షాన్ వాజ్ ఒత్తిడిచేశాడని సమాచారం.

రూమ్ లో నలుగురు గ్యాంగ్ రేప్
నాగ్ పూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని టిమ్కి ప్రాంతంలో లోడర్లు నివాసం ఉంటున్న అద్దె గదిలోకి ఆటో డ్రైవర్ షాన్ వాజ్ ఆ అమ్మాయిని పిలుచుకుని వెళ్లాడు. తరువాత షాన్ వాజ్, అతని స్నేహితుడు మొహమ్మద్ తౌసిఫ్ యూసఫ్ (26) అనే యువకుడితో పాటు అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న ఇద్దరు లోడర్లు మైనర్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారు.

మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్
అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన తరువాత షాన్ వాజ్ ఆమెను ఆటోలో పిలుచుకుని నాగ్ పూర్ లోని మయో హాస్పిటల్ స్వ్కేర్ ప్రాంతానికి పిలుచుకుని వెళ్లి అక్కడ ఆ అమ్మాయిని వదిలేసి వెళ్లిపోయాడు. రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడివున్న అమ్మాయిని చూసిన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమెను బలవంతంగా ఆటోలో లాక్కొని వెళ్లి మళ్లీ ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. అమ్మాయి మీద రెండో సారి గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు ఆమెను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు.

డబ్బు సహాయం చేసిన యువకులు
అర్దరాత్రి మైనర్ అమ్మాయి రోడ్డు పక్కన ఉన్న విషయం ఇద్దరు వ్యక్తులు గమనించారు. తాను ఊరికి రైలులో వెళ్లడానికి డబ్బు అవసరం అయిన అమ్మాయి వారికి చెప్పింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయికి కొంచెం డబ్బులు ఇచ్చి రైల్వే స్టేషన్ దగ్గర వదిలి పెట్టి జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.

జీఆర్ పీ పోలీసులు ఎంట్రీ
నాగ్ పూర్ రైల్వేస్టేషన్ లోకి వెళ్లిన అమ్మాయి రైలు టిక్కెట్ తీసుకుని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 1లోకి వెళ్లింది. ఫ్లాట్ ఫామ్ మీద ఒంటరిగా ఏడ్చుకుంటూ నిలబడి ఉన్న అమ్మాయిని రైల్వేస్టేషన్ లోని సీఆర్పీఫ్ పోలీసులు గమనించి ఆమెను ఏం జరిగింది అని అడిగారు. అమ్మాయి జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది.
Recommended Video

కామాంధులకు సీన్ సిడేల్
జీర్ పీ రైల్వే పోలీసులు అమ్మాయిని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. రంగంలోకి దిగిన జీఆర్ పీ రైల్వే పోలీసులు అమ్మాయిని వెంటపెట్టుకుని కామాంధుల కోసం గాలించారు. నాగ్ పూర్ లోని మోమిన్ పూర్ ప్రాంతంలో ఉన్న ఆటో డ్రైవర్ షాన్ వాజ్, యూసఫ్, మోహ్మద్ ముషీర్ అనే నిందితులను అరెస్టు చేసి సీతాబుల్డి పోలీసులకు అప్పగించారు. మైనర్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన మరో ఇద్దరు లోడర్ల కోసం గాలిస్తున్నామని సీతాబుల్డి పోలీసులు తెలిపారు. ఒకే అమ్మాయిని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆరు మంది కామాంధులు గ్యాంగ్ రేప్ చెయ్యడం మహారాష్ట్రలో కలకలం రేపింది.
అమ్మాయితో ఆమె వదినతో గొడవపడటంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందని, ఒంటరిగా చిక్కిన అమ్మాయి జీవితంతో ఆటో డ్రైవర్లు, లోడర్లు ఆడుకున్నారని వెలుగు చూడటంతో నాగ్ పూర్ లో కలకలం రేపింది. పరారైనా నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications