• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలీసులకు షాక్ : ఒంటిపై బట్టలు తొలగించిన ముంబై మోడల్

|

ముంబైలో ఓ మోడల్ అర్థరాత్రి హల్చల్ చేసింది. పోలీసుల ముందు బట్టలు విప్పి వారిని బెదిరించే ప్రయత్నం చేసింది. ఇక ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ముంబైలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది.

అర్థరాత్రి సిగరెట్ ప్యాకెట్ తీసుకురావాల్సిందిగా సెక్యూరిటీకి ఫోన్

అర్థరాత్రి సిగరెట్ ప్యాకెట్ తీసుకురావాల్సిందిగా సెక్యూరిటీకి ఫోన్

ఇక పోలీసు కథనం ప్రకారం... మేఘా శర్మ అనే మోడల్ లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటోంది. అక్టోబర్ 25 అర్థరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డు అలోక్‌కు ఫోన్ చేసి సిగరెట్ ప్యాకెట్ తీసుకురావాల్సిందిగా కోరింది. అయితే తీసుకురాలేనని సమాధానం చెప్పడంతో కోపోద్రిక్తురాలైన మేఘా శర్మ వెంటనే కిందకు దిగి వచ్చి అతనితో గొడవకు దిగింది. అతని చెంప చెళ్లు మనిపించింది. అలోక్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆమెను పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా కోరారు. అప్పటికే అర్థరాత్రి దాటడంతో ఇందుకు మేఘా శర్మ నిరాకరించింది. అది కూడా మహిళా కానిస్టేబుల్ కూడా లేనందున పోలీస్ స్టేషన్‌కు తెల్లారగానే వస్తానని చెప్పింది.

వాగ్వాదం చేసే ఓపిక లేక బట్టలను తొలగించింది

వాగ్వాదం చేసే ఓపిక లేక బట్టలను తొలగించింది

ఉదయాన్నే తన ఫ్లాట్‌కు వస్తే వారితో పాటే పోలీస్ స్టేషన్‌కు వస్తానని మేఘా శర్మ పోలీసులకు తెలిపింది . పోలీసులు ఇందుకు ఒప్పుకోకపోవడం, వెంటనే పోలీస్ స్టేషన్‌కు రావాలని పట్టుబట్టారు. వారిని బతిమలాడింది.. ఈ సమయంలో పోలీస్ స్టేషన్‌కు తను రాలేదని చెప్పింది. ఇక పోలీసులకు మేఘా శర్మల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక పోలీసులను వెనక్కు పంపించాలన్న ఉద్దేశంతో ఆమె తన ఒంటిపై ఉన్న వస్త్రాలను ఒక్కొక్కటిగా తీసేయడం ప్రారంభించింది. మేఘా పన్నిన ఉపాయం వర్కౌట్ అయ్యింది. పోలీసులు ఇది చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ గొడవ దృశ్యాలు ఆమె వస్త్రాలు తొలగిస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్‌ అయ్యింది.

ఇది ముంబై పోలీస్ వ్యవస్థ పనితీరు అంటూ ట్వీట్

అనంతరం శర్మ ముంబై పోలీస్ శాఖకు ట్వీట్ చేసింది. ఒక ఒంటరి అమ్మాయిని తెల్లవారు జామున మూడు గంటలకు అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తారు.. అది కూడా మహిళా పోలీసులు లేకుండా. ఇది మన ముంబై పోలీస్ వ్యవస్థ పనితీరు. రాత్రి 7 గంటల తర్వాత మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లరాదని చట్టాలు చెబుతున్నప్పటికీ ఇదేమీ పట్టించుకోలేదు. అని మేఘా శర్మ ట్వీట్ చేసింది. తన ఒంటిపై వస్త్రాలు కేవలం వారితో వాదించే ఓపికలేక విసుగుచెంది తొలగించినట్లు చెప్పింది. తను ఎంత చెప్పినప్పటికీ తన గదికి వెళ్లనివ్వలేదని ఆమె పేర్కొంది. ఇదిలా ఉంటే ఓషివారా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా ఆమెకు పోలీసులు చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేవలం ఫిర్యాదును మాత్రమే స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వెల్లడించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The tony Lokhandwala Complex saw high drama last week when a model stripped to thwart an attempt to be forcibly taken to the Oshiwara police station.According to the police, Megha Sharma, who is a paying guest at one of the buildings in the complex, called up the security guard on the intercom on the night of October 25 and asked him to buy her a pack of cigarettes.The guard, Alok, refused, following which Sharma allegedly stormed downstairs, picked up a fight with him and slapped him. Sharma then called up the police and sought their intervention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more