వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలకు భద్రత కరువవుతోంది: కోర్టు, అశ్లీల దృశ్యాలే

|
Google Oneindia TeluguNews

Mumbai no longer safe for women, indicates HC; spotlight on web
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయని బాంబే హైకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్ నెట్‌లో విచ్చలవిడిగా లభిస్తున్న అశ్లీల మెటీరియలే (చిత్రాలు, వీడియోలే) ఇందుకు కారణంగా మారుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఇంటర్ నెట్‌లో అలాంటి వాటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది.

ప్రస్తుతం ఇంటర్ నెట్‌లో అశ్లీల మెటీరియల్ సులభంగా లభ్యమవుతోందని, చిన్న పిల్లలు వాటిని చూసి చెడుదారుల వెంట పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి వల్ల మహిళలపై జరుగుతున్న నేరాలు పెరిగిపోతున్నాయని డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు విఎం కనడే, పిడి కోడెలు పేర్కొన్నారు.

మహిళలపై జరుగుతున్న పలు నేరాలపై న్యాయమూర్తులు సోమవారం విచారణ జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పటిష్టమైన రక్షణ విధానాన్ని పాటించాలని ఆదేశించారు. ముంబై నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, మహిళలకు భద్రత లేని నగరంగా తయారవుతోందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

2012లో పుణెలో పిబిఓ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి(22)ని సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. 2007లో ఓ మహిళ వాహనాన్ని ఎంగేజ్ తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో వాహనాన్ని ఆపి ఆమెపై అత్యాచారం చేసిన వాహన డ్రైవర్, ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఉద్యోగాలు చేస్తూ సాయంత్రం, రాత్రి ఇంటికి వచ్చే మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

English summary
The ease of access to offensive content on the internet is probably the reason for increasing crimes against women, the Bombay high court (HC) said on Monday, and suggested a ban on such material.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X