సముద్రం గుండా 10మంది ఉగ్రవాదులు, ముంబైలో పేలుళ్లకు కుట్ర
ముంబై: సముద్ర మార్గం గుండా పదిమంది ఉగ్రవాదులు మహారాష్ట్ర రాజధాని ముంబైకి చేరుకున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ముంబై పోలీసులకు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ముంబై అంతటా హై అలర్ట్ ప్రకటించారు.
విమానాశ్రయాలు, నౌకాయాన కేంద్రాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సదరు పదిమంది ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ముంబైలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

రాబోయే మూడు నెలల కాలంలో సముద్ర మార్గం గుండా వచ్చిన పదిమంది ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని చెప్పారు. కాగా, పదిమంది ఉగ్రవాదుల్లో ఐదుగురి ఫోటోలను ముంబై పోలీసులు విడుదల చేశారు. వారు ఎక్కడ తలదాచుకున్నారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు.












Click it and Unblock the Notifications