ఫైర్: శివసేన హోర్డింగులు పీకేసిన పోలీస్
ముంబై: శివసేన-బీజేపీ పార్టీ నాయకుల మద్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నది. ఇప్పుడు దీనికి తోడు పోలీసులు చేసిన పనికి ఈ రెండు పార్టీల నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం మీద ఈ ప్రభావం చూపిస్తుందా అని అనుమానం కలుగుతున్నది.
దసరా పండుగ నేపథ్యంలో శివసేన ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ సందర్బంగా శివసేన పార్టీ నాయకులు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. అందులో నేటి ప్రధాని నరేంద్ర మోదీ శివసేన అధినేత బాల్ ఠాక్రే ముందు తలవంచి నవ్వుతూ నమస్కరిస్తున్న ఫోటోలు వేశారు.
ఆనాటి రోజులు మీరు మర్చిపోయారా, మీలాంటి గర్విస్టులంతా బాల్ ఠాక్రే పాదాల ముందు తలవంచిన రోజులు గుర్తుకు లేవా అంటూ వ్యాఖ్యలు పెట్టారు. అంతే కాకుండా వాజ్ పేయి, ఎల్.కే. అద్వాని, రాజ్ నాథ్ సింగ్ తదితరులు ఠాక్రే కాళ్ల దగ్గర మోకరిల్లినవారే అంటూ ఫ్లెక్సీలలో వాఖ్యలు పెట్టారు.

అయితే ఈ ఫ్లెక్సీలు, హోర్డింగులు బీజేపీ-శివసేన పార్టీల మద్య చిచ్చు రేపుతాయని ఉద్దేశంతోనే తాము తొలగించామని ముంబై పోలీసు అధికారులు అంటున్నారు. ఈ విషయంపై శివసేన నాయకులు మండిపడుతున్నారు.
బీజేపీ నాయకుల ఆదేశాల మేరకే వాటిని తొలగించారని శివసేన ఆరోపిస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ హోర్డింగుల వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో, ఎందుకు ఈ విషయంలో తలదూర్చామని పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు.












Click it and Unblock the Notifications