నటి ప్రీతి జింటాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్
ముంబై: బాలీవుడ్ నటి ప్రీతి జింటా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంది. ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో పోలీసులు ఆమెను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చునని అంటున్నారు. ప్రీతి జింటాపై స్క్ర్రిప్టు రైటర్ అబ్బాస్ తైరేవాలా కోర్టుకు ఫిర్యాదు చేశారు.
తనకు ప్రీతి జింటా 18 లక్షల రూపాయలకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని ఆరోపించారు. ఈ కేసులో ముంబై కోర్టు ఇంతకు ముందు ఆమెకు సమన్లు జారీ చేసింది. వరుసగా నాలుగు సార్లు కోర్టుకు ప్రీతి జింటా హాజరు కాలేదు. దీంతో గురువారం ప్రీతి జింటా అరెస్టుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది.

తాను రాజకీయాల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటన చేసి ప్రీతి జింటా ఇంతకు ముందు వార్తల్లోకి ఎక్కారు. దేశంలోని అవినీతిని అంతం చేయడానికి తాను రాజకీయాల్లో చేరాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
మనదేశంలో సంభవిస్తున్న పరిణామాలు చాలా విచారకరంగా ఉన్నాయని, దాంతో తాను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నానని ప్రీతి జింటా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. దేశాన్ని సానుకూల దిశలో నడిపించడానికి ఏదో ఒక రోజు తాను రాజకీయాల్లోకి వచ్చి తనకు ఓటు వేయాలని కోరుతానని చెప్పారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications