Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తప్పిన పెను ప్రమాదం: రైల్వే ట్రాక్‌పై కూలిన రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఇద్దరికి గాయాలు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. అంధేరీ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉన్న గోఖలే రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి కొంత భాగం కుప్పకూలి ట్రాక్‌పై పడిపోయింది. ఆ సమయంలో రైళ్లేవి ఆ మార్గంలో రాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఘటన జరిగిన వెంటనే పశ్చిమ లైన్‌పై రైళ్ల రాకపోకను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శకలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

Mumbai Rains: 2 injured after foot overbridge collapses partially in Andheri west

ప్రస్తుతం బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను నిలిపివేసిన అధికారులు.. సహాయక చర్యలు ప్రారంభించారు. తూర్పు-పశ్చిమ అంధేరీలను కలుపుతూ గోఖలే బ్రిడ్జిని నిర్మించారు. ఘటనలో ఇప్పటిదాకా ఇద్దరికీ గాయాలైనట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం శకలాల తొలగింపు కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ వంతెన కూలినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత సంవత్సరం ముంబై ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌లోని పురాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+